అఖిలపక్ష పార్టీలతో ప్రధాని భేటీ!

| Edited By:

Jun 16, 2019 | 7:50 PM

పార్లమెంట్‌ సమావేశాలకు ముందు రోజు మోదీ అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల భేటీ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘మనం ఇక్కడ ప్రజల కోసం ఉన్నాం. పార్లమెంట్‌ సమావేశాలకు ఆటంకం కలిగించడం ద్వారా ప్రజల మన్ననలను పొందలేం. అందుకే విభేదాలను పక్కనపెట్టి జాతి ప్రగతికి ముందుకు సాగుదాం’’ అని పిలుపునిచ్చారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడచుకుంటున్నామా లేదా అనే విషయాన్ని ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఎంపీలకు మోదీ సూచించారు. 2022 నాటికి నవభారత నిర్మాణాన్ని […]

అఖిలపక్ష పార్టీలతో ప్రధాని భేటీ!
Follow us on

పార్లమెంట్‌ సమావేశాలకు ముందు రోజు మోదీ అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల భేటీ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘మనం ఇక్కడ ప్రజల కోసం ఉన్నాం. పార్లమెంట్‌ సమావేశాలకు ఆటంకం కలిగించడం ద్వారా ప్రజల మన్ననలను పొందలేం. అందుకే విభేదాలను పక్కనపెట్టి జాతి ప్రగతికి ముందుకు సాగుదాం’’ అని పిలుపునిచ్చారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడచుకుంటున్నామా లేదా అనే విషయాన్ని ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఎంపీలకు మోదీ సూచించారు. 2022 నాటికి నవభారత నిర్మాణాన్ని సాధించే దిశగా సభ్యులు తమ సలహాలు, సూచనలు అందజేయాలని అన్నారు.

సోమవారం నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ట్రిపుల్‌ తలాక్‌తో పాటు పలు కీలక బిల్లులను ఈ సమావేశాల్లోనే తీసుకురానున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జులై 5న ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.