నిలకడగా కోడెల ఆరోగ్యం..!

| Edited By:

Aug 24, 2019 | 10:21 AM

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. రాత్రి 10.30 గంటల సమయంలో కోడెలకు గుండెనొప్పి వచ్చింది. శ్వాస తీసుకోవడం కూడా కష్టం కావడంతో.. ప్రస్తుతం ఆయన్ని వెంటిలేటర్‌పై ఉంచారు. ఇంకా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఐసీయూలోనే ఉంచి కోడెల ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్న డాక్టర్లు. కోడెల అల్లుడు మనోహర్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న మాజీ స్పీకర్ కోడెల. తీవ్ర ఒత్తిడికి గురైన కోడెలకు గుండె పోటు వచ్చినట్లు ఆయన […]

నిలకడగా కోడెల ఆరోగ్యం..!
Follow us on

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. రాత్రి 10.30 గంటల సమయంలో కోడెలకు గుండెనొప్పి వచ్చింది. శ్వాస తీసుకోవడం కూడా కష్టం కావడంతో.. ప్రస్తుతం ఆయన్ని వెంటిలేటర్‌పై ఉంచారు. ఇంకా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఐసీయూలోనే ఉంచి కోడెల ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్న డాక్టర్లు. కోడెల అల్లుడు మనోహర్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న మాజీ స్పీకర్ కోడెల.

తీవ్ర ఒత్తిడికి గురైన కోడెలకు గుండె పోటు వచ్చినట్లు ఆయన బంధువులు తెలిపారు. అసెంబ్లీ ఫర్నిచర్‌ మిస్సింగ్‌నకు సంబంధించి నిన్న అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. మధ్యలో సత్తెనపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో కంప్యూటర్ల చోరీ వ్యవహారం కూడా కోడెలను మరింత ఒత్తిడికి గురి చేసింది. ఒకవైపు అసెంబ్లీ ఫర్నిచర్‌ మిస్సింగ్‌ కేసు, మరో వైపు క్యాప్‌ ఆఫీస్‌లో కంప్యూటర్ల చోరీ కోడెలను ఇబ్బందులకు గురి చేసింది. ఇంత ఒత్తిడి కారణంగానే ఆయనకు గుండె పోటు వచ్చిందంటున్నారు.