జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం..

| Edited By: Ravi Kiran

Mar 13, 2020 | 11:56 AM

ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి... మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే మొగ్గు చూపుతుంటారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవుదామని భావిస్తుంటారు. అలా కుదరకపోతే ఎంపీగా పోటీ చేస్తారు. కానీ మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు...

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం..
Follow us on

ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి… మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే మొగ్గు చూపుతుంటారు. అవకాశం వస్తే మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవుదామని భావిస్తుంటారు. అలా కుదరకపోతే ఎంపీగా పోటీ చేస్తారు. లేకపోతే ఎమ్మెల్యే లేదా మంత్రి ప్రోటోకాల్ ఉన్న పదవుల కోసం ఎదురుచూస్తుంటారు. కానీ మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తక్కువ పోస్టుకు నామినేషన్ వేసి అందరిని ఆశ్చర్యపరిచారు. తాను పనిచేసిన పదవి కంటే తక్కువ పోస్టుకు నామినేషన్ వేసి రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు. శాసనసభ సభ్యుడిగా పని చేసిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు.

గతంలో తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ ప్రభాకర్‌రెడ్డి తాజాగా తాడిపత్రి మున్సిపాలీటీ 30వ వార్డుకు కౌన్సిలర్‌గా నామినేషన్ దాఖలు చేశారు. తాను పనిచేసిన పదవి కంటే తక్కువ పోస్టుకు నామినేషన్ వేసి రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు. శాసనసభ సభ్యుడిగా పని చేసిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తరపున ఆయన న్యాయవాదులు నామినేషన్ వేశారు. అదే వార్డులో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తాడిపత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద కుమారుడు హర్షవర్ధన్ పోటీకి దిగడంతో మరోసారి తాడిపత్రిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరపున అభ్యర్థులెవరూ బరిలోకి దిగకూడదని… తాడిపత్రి బరిలో తమ మద్దతుదారులు ఎన్నికల్లో పోటీ చేయరని కొద్దిరోజుల క్రితం జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన చేసినా ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్‌గా పోటీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.