చంద్రబాబు వెనక్కి వెళ్లకుంటే.. ఆత్మహత్య చేసుకుంటా

| Edited By:

Feb 27, 2020 | 2:37 PM

విశాఖలో చంద్రబాబు కాన్వాయ్.. ముందుకు కదలడం లేదు. రెండున్నర గంటల నుంచి ఎయిర్‌ పోర్టు ప్రాంతంలోనే ఉండిపోయారు. వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో కాన్వాయ్ ముందుకు కదలలేని..

చంద్రబాబు వెనక్కి వెళ్లకుంటే.. ఆత్మహత్య చేసుకుంటా
Follow us on

చంద్రబాబు విశాఖ పర్యటనలో భాగంగా.. ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు గో బ్యాక్ అంటూ నిరసనలు చేస్తున్నారు. దీంతో చంద్రబాబు కాన్వాయ్.. ముందుకు కదలడం లేదు. రెండున్నర గంటల నుంచి ఎయిర్‌ పోర్టు ప్రాంతంలోనే ఉండిపోయారు. వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో కాన్వాయ్ ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. కొందరు కార్యకర్తలు కాన్వాయ్‌లోని వాహనాలు ఎక్కి మరీ నిరసన తెలిపారు. నల్ల జెండా పట్టుకుని ప్రజా సంఘాల అధ్యక్షుడు జేటీ రామారావు అనే వ్యక్తి వాహనం ఎక్కి.. జేబులోంచి పెట్రోల్ బాటిల్ పోసుకుంటానని బెదిరించాడు. పోలీసులు వెంటనే అతన్ని కిందకు లాగేశారు. చంద్రబాబు ఎయిర్ పోర్టు నుంచి వెనక్కి వెళ్లకపొతే.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని జేఏసీ అధ్యక్షుడు రామారావు బెదిరిస్తున్నారు.