సీఎం అయితే ‘రాజధాని’ని మారుస్తారా? తుగ్లక్‌ నిర్ణయాలు తీసుకుంటే!

| Edited By:

Dec 27, 2019 | 5:27 PM

సీఎం అయితే రాజధానిని మారుస్తారా అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. అసలు రాజధానిని మార్చే హక్కు మీకు ఎవరిచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం రోజుకో మాటతో రాజధానిని గందరగోళంలోకి నెట్టుతున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. అమరావతి ప్రజా రాజధాని అని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ.. పరిపాలనా వికేంద్రీకరణతో ప్రయోజనం లేదన్నారు. […]

సీఎం అయితే రాజధానిని మారుస్తారా? తుగ్లక్‌ నిర్ణయాలు తీసుకుంటే!
Follow us on

సీఎం అయితే రాజధానిని మారుస్తారా అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. అసలు రాజధానిని మార్చే హక్కు మీకు ఎవరిచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం రోజుకో మాటతో రాజధానిని గందరగోళంలోకి నెట్టుతున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. అమరావతి ప్రజా రాజధాని అని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ.. పరిపాలనా వికేంద్రీకరణతో ప్రయోజనం లేదన్నారు.

దేశంలో ఎక్కడా.. మూడు రాజధానులు లేవు. అసలు రాజధానిని మార్చే అధికారం మీకు ఎవరిచ్చారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చంద్రబాబు. జగన్‌ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకూ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు. 10 వేల కోట్ల రూపాయలు అమరావతికి ఖర్చు పెట్టామని.. రైతులతో అగ్రిమెంట్లు ఉన్నాయన్నారు. అసలు వారికి అమరావతి కాన్సెప్ట్ అర్థమయ్యిందా..? సంపద సృష్టించే నగరం అమరావతి అని వ్యాఖ్యానించారు చంద్రబాబు.

రాజధానిపై ఎలాంటి ప్రకటన వస్తుందోనని ఏకంగా 29 గ్రామాలు నిద్రాహారాలు మాని టెన్షన్ పడుతున్నారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అంతేకాకుండా.. తెలుగుదేశం పార్టీ నాయకులను హాస్‌ అరెస్ట్ చేస్తున్నారు. మహిళలు కూడా స్వతంత్రంగా రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు.

కాగా.. అమరావతిలో రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవని ప్రభుత్వం కావాలని చెబుతోంది. అక్కడ ముంపు సమస్యే లేదని.. భౌగోళికంగా రాజధానికి అనుకూలమని నిపుణుల కమిటీ చెప్పిన తరువాతనే అక్కడ శంకుస్థాపన చేశామన్నారు. ఇప్పటికే విశాఖకు పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చాయి. వాటిని కూడా వెనక్కి పంపించేస్తున్నారు. విశాఖపట్నంలో మెట్రోకు కూడా శ్రీకారం చుట్టాము. రాయలసీమను ఉత్పత్తి రంగానికి హబ్‌గా మార్చాలనుకున్నామని చంద్రబాబు తెలిపారు.