‘సర్వే మాయాజాలం’..ఉత్తుత్తి ప్రొటెస్ట్..చూడాల్సిందే..!

|

Oct 22, 2019 | 5:45 PM

నిరసన ప్రదర్శనలకి ఒక్కొక్కరు ఒక్కో రూట్ ఎంచుకుంటారు. శాంతియుత మార్గాల్లో తన ఆవేదనను వ్యక్తం చేసేవారు కొందరైతే..రొడ్లపైకి వచ్చి బంద్‌లు, రాస్తారోకోలు చేసేది మరికొందరు. కానీ ఉత్తుత్తి ప్రొటెస్ట్ చేసే వ్యక్తులను మీరు ఎప్పుడైనా చూశారా?. ఇప్పుడు ఆయన్నే మీకు చూపించబోతున్నాం. అతను మాములు వ్యక్తి కూడా కాదండోయ్..మాజీ కేంద్రమంత్రి. తెలంగాణ కాంగ్రెస్‌లో తలపండిన నేత. ఇక సస్పెన్స్ రివీల్ చేయబోతున్నాం..హి ఈజ్ నన్ అదర్ దాన్ సర్వే సత్యనారాయణ. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం తీరుకు నిరసనగా […]

సర్వే మాయాజాలం..ఉత్తుత్తి ప్రొటెస్ట్..చూడాల్సిందే..!
Follow us on

నిరసన ప్రదర్శనలకి ఒక్కొక్కరు ఒక్కో రూట్ ఎంచుకుంటారు. శాంతియుత మార్గాల్లో తన ఆవేదనను వ్యక్తం చేసేవారు కొందరైతే..రొడ్లపైకి వచ్చి బంద్‌లు, రాస్తారోకోలు చేసేది మరికొందరు. కానీ ఉత్తుత్తి ప్రొటెస్ట్ చేసే వ్యక్తులను మీరు ఎప్పుడైనా చూశారా?. ఇప్పుడు ఆయన్నే మీకు చూపించబోతున్నాం. అతను మాములు వ్యక్తి కూడా కాదండోయ్..మాజీ కేంద్రమంత్రి. తెలంగాణ కాంగ్రెస్‌లో తలపండిన నేత. ఇక సస్పెన్స్ రివీల్ చేయబోతున్నాం..హి ఈజ్ నన్ అదర్ దాన్ సర్వే సత్యనారాయణ.

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం తీరుకు నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలోనే పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరిని ముందుగానే గృహ నిర్భందం చేయగా… రేవంత్ రెడ్డి లాంటి నాయకులను ప్రగతి భవన్ పరిసర ప్రాంతాల్లో అడ్డుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్వే సత్యనారాయణను పోలీసులు ఆయన ఇంటి దగ్గరే అడ్డుకున్నారు. ఇందులోనే అసలు కిటుకు ఉంది. జస్ట్ ఫోటోలు కోసం విజువల్స్ కోసం ఆయన ఒక స్టిల్ ఇచ్చారు అంతే.  చుట్టుముట్టి ఆయన్ను పట్టుకున్నట్టుగా పోలీసులు…వారిని విదిలించుకోడానికి ప్రయత్నిస్తూ నిరసన తెలియజేస్తున్న లీడర్‌గా సర్వే.. ఓ రేంజ్‌లో సీన్‌ను రక్తి కట్టించారు. సినిమాల్లో కట్ చెప్పగానే ఎవరి పని వారు చూసుకున్నట్టు.. ఫోటోలు తీయడం అయిపోగానే ఇక్కడ కూడా అందరూ సైలెంట్ అయిపోయారు. అయితే ఈ సంఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి  వీడియో తీసి సోషల్ మీడియాలో ఫోస్ట్ చెయ్యడంతో అది ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది.  నెటిజన్లు  సర్వేపై సెటైరికల్ కామెంట్స్ కురిపిస్తున్నారు.