ప్రతీ ఆదివారం పది ని.లు.. ఇక ‘ఆ’ పని చేయాల్సిందే!

|

May 09, 2020 | 3:27 PM

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పౌరులందరు విధిగా చేయాల్సిన పనులను నిర్దేశిస్తోంది. పురపాలక శాఖ ఇందుకుగాను ఉత్తర్వులను జారీ చేసింది. ప్రతీ ఆదివారం పది నిమిషాల పాటు చేయాల్సిన పనిని నిర్దేశిస్తూ మునిసిపిల్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రతీ ఆదివారం పది ని.లు.. ఇక ‘ఆ’ పని చేయాల్సిందే!
Follow us on

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పౌరులందరు విధిగా చేయాల్సిన పనులను నిర్దేశిస్తోంది. పురపాలక శాఖ ఇందుకుగాను ఉత్తర్వులను జారీ చేసింది. ప్రతీ ఆదివారం పది నిమిషాల పాటు చేయాల్సిన పనిని నిర్దేశిస్తూ మునిసిపిల్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ ఉత్తర్వులిచ్చామని పురపాలక శాఖాధికారులు చెబుతున్నారు.

కరోనా వైరస్ రాకతో దేశంలో ఆరోగ్యంపై శ్రద్ద పెరుగున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వాలు కూడా వైద్య, ఆరోగ్యాలపై మరింత శ్రద్ధ చూపాలని భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తదనుగుణంగా ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పురపాలక శాఖ ప్రతీ ఆదివారం పౌరులు చేయాల్సిన పనులను గుర్తు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

‘ప్రతి ఆదివారం- పది గంటలకు- పదినిమిషాలు ‘ పేరిట సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని పురపాలక శాఖ ప్రారంభించనున్నది.  ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అందర్నీ కలుపుకొని ముందుకుపోవాలని మున్సిపల్ కమిషనర్లకు మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలిచ్చారు.  ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే ఉండి దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టాలని పురపాలక శాఖ పౌరులందరికీ సూచిస్తోంది. సో.. ప్రతీ ఆదివారం పది నిమిషాలపాటు దోమలు పారదోలే కార్యక్రమంలో ప్రజలందరు పాలుపంచుకోవాల్సిందే.

ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అన్ని పట్టణాల్లో ఆస్తిపన్నుపైన ఐదు శాతం ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకం ప్రకటించింది మునిసిపల్ శాఖ. ఇప్పటి దాకా వార్షిక ఆస్తిపన్ను 30వేల రూపాయలకు లోపు వున్నవారికే వర్తించే ప్రోత్సాహకాలను ఇకపై ఏ పరిమితి లేకుండా అమలు చేస్తారు. ఈ మేరకు ఉన్న పరిమితి ఎత్తేస్తూ పురపాలక శాఖ నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను ఎంత ఉన్నా మే 31వ తేదీ లోపల పన్ను చెల్లిస్తే ఐదు శాతం ప్రోత్సాహకం వర్తిస్తుంది.  రెసిడెన్షియల్, కమర్షియల్ కేటగిరీల వారందరికీ ఈ ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకం వర్తిస్తుందని పురపాలక శాఖ తెలిపింది.