లాక్‌డౌన్ ప్రజలు సహకరించాలి : ఈటెల

|

Mar 23, 2020 | 1:40 PM

ప్రైవేట్ మెడికల్ కాలేజీ యజమానులతో మంత్రి ఈటెల సమావేశమయ్యారు. ఐసోలేషన్ ఐసియు సేవలకు ప్రైవేట్ హాస్పిటల్ సహకారం కావాలని ఆయన వారిని అభ్యర్థించారు. 1897 అంటువ్యాధుల నివారణ చట్టం ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న ఈటెల..ఆర్డీవో స్థాయి అధికారులు, డాక్టర్లు నుండి మొదలుకుని ప్రతి ప్రభుత్వ అధికారి అందుబాటులో ఉంటాని తెలిపారు. ఎలాంటి నిబంధనలు పాటించాలో ప్రభుత్వ అధికారులు వివరిస్తారని,  అనుభవజ్ఞులైన ప్రైవేటు డాక్టర్లు కూడా సలహాలు ఇవ్వవచ్చని తెలిపారు.  ప్రైవేటు, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మొత్తం 15,040 […]

లాక్‌డౌన్ ప్రజలు సహకరించాలి : ఈటెల
Follow us on

ప్రైవేట్ మెడికల్ కాలేజీ యజమానులతో మంత్రి ఈటెల సమావేశమయ్యారు. ఐసోలేషన్ ఐసియు సేవలకు ప్రైవేట్ హాస్పిటల్ సహకారం కావాలని ఆయన వారిని అభ్యర్థించారు. 1897 అంటువ్యాధుల నివారణ చట్టం ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న ఈటెల..ఆర్డీవో స్థాయి అధికారులు, డాక్టర్లు నుండి మొదలుకుని ప్రతి ప్రభుత్వ అధికారి అందుబాటులో ఉంటాని తెలిపారు. ఎలాంటి నిబంధనలు పాటించాలో ప్రభుత్వ అధికారులు వివరిస్తారని,  అనుభవజ్ఞులైన ప్రైవేటు డాక్టర్లు కూడా సలహాలు ఇవ్వవచ్చని తెలిపారు.  ప్రైవేటు, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మొత్తం 15,040 వేల బెడ్స్ ఉన్నాయని తెలిపారు. ప్రజంట్ తెలంగాణలో కరోనా సెకండ్ స్టేజ్‌లోకి ఎంటరైందని భావించవొచ్చన్నారు. 81 శాతం మంది పేషెంట్స్‌కు మాములు డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉందని, 4 నుంచి 5 శాతం మందికి ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో చికిత్స అందిచాల్సి ఉంటుందని తెలిపారు.