ఈఎస్‌ఐ స్కాం: వెలుగుచూస్తోన్న కొత్త కోణాలు..! ఇంత దారుణమా..!!

| Edited By: Pardhasaradhi Peri

Sep 28, 2019 | 9:56 PM

ఈఎస్‌ మెడికల్ స్కాంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. చెర్లపల్లి డిస్పెన్సరీ నుంచే పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దేవికా రాణిని అడ్డం పెట్టుకుని అందినంతా దోచుకున్న ఫార్మాసిస్ట్‌ కంపెనీలు. 2015 నుంచి 2019 వరకు పెద్దమొత్తంలో మందుల కొనుగోళు జరిగాయి. రూ.82 లక్షల మందులకు గానూ.. రూ.3.21 కోట్ల సొమ్మును డ్రా చేసిన అధికారులు. ముఖ్యంగా 5 కంపెనీల నుంచి మందులను కొనుగోలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. తక్కువ సొమ్ముకు మందులు కొని.. ఎక్కువ […]

ఈఎస్‌ఐ స్కాం: వెలుగుచూస్తోన్న కొత్త కోణాలు..! ఇంత దారుణమా..!!
Follow us on

ఈఎస్‌ మెడికల్ స్కాంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. చెర్లపల్లి డిస్పెన్సరీ నుంచే పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దేవికా రాణిని అడ్డం పెట్టుకుని అందినంతా దోచుకున్న ఫార్మాసిస్ట్‌ కంపెనీలు. 2015 నుంచి 2019 వరకు పెద్దమొత్తంలో మందుల కొనుగోళు జరిగాయి. రూ.82 లక్షల మందులకు గానూ.. రూ.3.21 కోట్ల సొమ్మును డ్రా చేసిన అధికారులు. ముఖ్యంగా 5 కంపెనీల నుంచి మందులను కొనుగోలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. తక్కువ సొమ్ముకు మందులు కొని.. ఎక్కువ కొనుగోలు చేసినట్టుగా బిల్లులు సృష్టించిన ఫార్మా కంపెనీలు. అచ్చం.. సినిమాల్లో చూపించిన విధంగా.. ఫార్మా కంపెనీలు.. సీన్‌ రిపీట్‌ చేసినట్టు.. ఏసీబీ అధికారులు తెలిపారు.

కాగా.. ప్రస్తుతం 14 మెడిసిన్స్‌పై, అలాగే.. 5 ప్రముఖ ఫార్మా కంపెనీలపై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నట్టు చెప్పారు. భాస్కర ఏజన్సీ, క్రిష్టల్ ఎంటర్ ప్రైజెస్, శ్రీ సంతోష్, గరుడ, లక్ష్మీ ఫార్మా కంపెనీలను విచారణ చేస్తున్నట్టు పేర్కొన్న అధికారులు. రెండు రూపాల మందు బిల్లలను.. ఏకంగా 12 రూపాయలకు కొనుగోలు చేసినట్లు బిల్లులు సృష్టించిన ఫార్మ కంపెనీలు. దేవికా రాణి, పద్మ, వసంత అక్రమాలపై.. అధికారులు సమగ్ర విచారణ చేస్తోన్నారు. ఈఎస్‌ఐ స్కాంకు చెందిన మరో 12 మంది ఫార్మాసిస్ట్‌లపై అధికారులు విచారణ చేస్తున్నారు.