Eluru Disease: ఏలూరు వింత వ్యాధి ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి టీడీపీ ఫిర్యాదు.. విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలంటూ..

|

Dec 08, 2020 | 1:29 PM

పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో వింత వ్యాధి విస్తరిస్తున్న ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి టీడీపీ ఫిర్యాదు చేసింది.

Eluru Disease: ఏలూరు వింత వ్యాధి ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి టీడీపీ ఫిర్యాదు.. విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలంటూ..
Follow us on

Eluru Disease: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో వింత వ్యాధి విస్తరిస్తున్న ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి టీడీపీ ఫిర్యాదు చేసింది. పరిశుభ్రమైన నీరు పొందడం మానవ హక్కు. అలాంటి మంచి నీరు ప్రజలకు అందించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఏలూరులో త్రాగునీరు బాగా కలుషితమైంది. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం చేయాలంటూ కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో టీడీపీ పేర్కొంది.

కాగా, ప్రస్తుతం వింత వ్యాధి బారినపడ్డ బాధితుల సంఖ్య 544 పైచిలుకు చేరింది. వీరిలో 153 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో 17 మంది బాధితులను గుంటూరు, విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఇక 332 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్టు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మూర్ఛపోయి ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతూ శ్రీధర్‌ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజులుగా ఈ వింత వ్యాధితో వందల మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇక బాధితుల్లో 270 మంది పురుషులు, 235 మంది మహిళలు, 71 మంది చిన్నారులు ఉన్నారు.