Elon Musk: ‘మాట ఇచ్చినట్లే మేము వచ్చేస్తున్నాం’… భారత్‌లోకి టెస్లా రాకపై తొలిసారి స్పందించిన సీఈఓ..

|

Jan 17, 2021 | 5:34 AM

Elon Musk Tweet About Tesla India: అంతర్జాతీయంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఎలక్ట్రానిక్‌ కార్ల కంపెనీ టెస్లా భారత్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో..

Elon Musk: మాట ఇచ్చినట్లే మేము వచ్చేస్తున్నాం... భారత్‌లోకి టెస్లా రాకపై తొలిసారి స్పందించిన సీఈఓ..
Follow us on

Elon Musk Tweet About Tesla India: అంతర్జాతీయంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఎలక్ట్రానిక్‌ కార్ల కంపెనీ టెస్లా భారత్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో విద్యుత్‌ ఆధారంగా నడిచే వాహనాల తయారీపై ప్రాముఖ్యత పెరుగుతుండడం, ప్రభుత్వాలు కూడా రాయితీలు ప్రకటిస్తోన్న నేపథ్యంలో టెస్లా భారత్‌లోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంటోందని గత కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ వార్తలపై తొలిసారి అధికారికంగా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు ఎలాన్‌ మస్క్‌. త్వరలోనే భారతమార్కెట్‌లోకి టెస్లా ప్రవేశిస్తుందన్న వార్తలను ధృవీకరించారు. ‘అత్యంత ఖరీదైన టెస్లా కార్లు భారతీయ మార్కెట్లో ఎంత వరకు రాణిస్తాయి.. వాటికి ఇండియన్‌ మార్కెట్లో గల అవకాశాలను విశ్లేషిస్తూ పోస్ట్‌ చేసిన ఓ బ్లాగ్‌ పోస్ట్‌పై మస్క్‌ స్పందించారు. ఆ పోస్ట్‌కు రిప్లై ఇస్తూ.. ‘హామీ ఇచ్చినట్టుగానే’ (మేం వచ్చేస్తున్నాం) అనే అర్థం వచ్చేలా కామెంట్‌ చేశాడు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టెస్లా భారత్‌లో తమ కార్యక్రమాలను ప్రారంభించేందుకు నమోదు చేసుకున్న క్రమంలో ఈ ట్వీట్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే తయారీ ప్లాంట్, ఆర్‌అండ్‌డీ కేంద్రం ఏర్పాటు కోసం టెస్లా.. 5 రాష్ట్రాలతో చర్చిస్తున్నట్లు సమాచారం. భారత్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటర్స్‌తో టెస్లా జట్టు కట్టే అవకాశాలున్నాయంటూ వార్తలు వచ్చినప్పటికీ.. టాటా మోటార్స్‌ ఆ వార్తలను ఖండించింది.

Also Read: Navalben: పాలను అమ్మి రూ.1.10 కోట్లు సంపాదించింది.. రాష్ట్రపతి సాధికారిత గుర్తింపులో మహిళ ‘నవల్‌బెన్‌’