Elon Musk: భారీ నజరానా ప్రకటించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. ఇందుకోసం ఏం చేయాలంటే…

|

Jan 22, 2021 | 12:04 PM

Elon Musk Says He will Give Big Prize: ఎలాన్‌ మస్క్‌ తాజాగా ఓ భారీ నజరానాను ప్రకటించారు. టెస్లా పేరుతో ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ స్థాపించిన ఈ వ్యాపారవేత్త ప్రస్తుతం ప్రపంచ కుబేరుడిగా అవతరించిన విషయం తెలిసిందే. కర్బన ఉద్గారాలను..

Elon Musk: భారీ నజరానా ప్రకటించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. ఇందుకోసం ఏం చేయాలంటే...
Follow us on

Elon Musk Says He will Give Big Prize: ఎలాన్‌ మస్క్‌ తాజాగా ఓ భారీ నజరానాను ప్రకటించారు. టెస్లా పేరుతో ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ స్థాపించిన ఈ వ్యాపారవేత్త ప్రస్తుతం ప్రపంచ కుబేరుడిగా అవతరించిన విషయం తెలిసిందే. కర్బన ఉద్గారాలను తగ్గించే క్రమంలో ప్రపంచానికి ఎలక్ట్రానిక్‌ కార్లను పరిచయం చేసిన ఎలాన్‌ మస్క్‌ తాజాగా మరో అడుగు ముందుకేశారు.
కర్బన ఉద్గారాలను తగ్గించే సాంకేతికతను అభివృద్ధి చేసే కార్యక్రమంలో తాను భాగం కావాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే కర్బన ఉద్గారాలను తగ్గించే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నవారిని ప్రోత్సహించేందుకు ఎలాన్‌ భారీ నజరానా ప్రకటించారు. ఈ సాంకేతికతను అభివృద్ధి చేసిన వారికి 100 మిలియన్‌ డాలర్లు… మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 730 కోట్లు బహుమానంగా ఇస్తానని ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఇక ఈ నజరానాకు సంబంధించిన పూర్తి వివరాలను వచ్చే వారం వివరాస్తానని ఎలాన్‌ తెలిపారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష పదవిని స్వీకరించిన వెంటనే జో బైడెన్‌ కూడా కర్బన ఉద్గారాలను ఒడిసిపట్టే సాంకేతికత అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే.

Also Read: China Gold Mine Blast : చైనా గనిలో వర్కర్ల వెలికితీతపై కొనసాగుతున్న ప్రయత్నాలు.. మరో 15 రోజులు పట్టవచ్చని అంచనా