ఓల్డ్ మలక్‌పేటలో ముగిసిన ఎన్నికలు.. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం..

|

Dec 03, 2020 | 6:23 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఒకటో తేదీన ఓల్డ్ మలక్‌పేటలో జరగాల్సిన ఎన్నికలు సీపీఎం, సీపీఐ గుర్తులు తారుమారు కావడంతో ఎన్నికల అధికారులు ఈ రోజు రీ పోలింగ్ నిర్వహించారు.

ఓల్డ్ మలక్‌పేటలో ముగిసిన ఎన్నికలు.. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం..
Follow us on

Old Malakpet Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఒకటో తేదీన ఓల్డ్ మలక్‌పేటలో జరగాల్సిన ఎన్నికలు సీపీఎం, సీపీఐ గుర్తులు తారుమారు కావడంతో ఎన్నికల అధికారులు ఈ రోజు రీ పోలింగ్ నిర్వహించారు. తాజాగా ఆ డివిజన్‌లో ఎన్నికలు ముగిసినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు 35.9 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగా రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ షురూ అవుతుంది. కౌంటింగ్‌కు సంబంధించి ఎన్నికల అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటుచేశారు. సాయంత్రానికల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.