బెల్లీ డాన్పర్‌కు 3ఏళ్ల జైలు శిక్ష, రూ.14 లక్షల జరిమానా.. రీజన్ ఇదే..

| Edited By:

Jun 29, 2020 | 5:00 AM

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు సాముహిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు చేసినందుకుగాను ఓ బెల్లీ డాన్పర్‌కు

బెల్లీ డాన్పర్‌కు 3ఏళ్ల జైలు శిక్ష, రూ.14 లక్షల జరిమానా.. రీజన్ ఇదే..
Follow us on

Egyptian belly-dancer: ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు సాముహిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు చేసినందుకుగాను ఓ బెల్లీ డాన్పర్‌కు 3ఏళ్ల జైలు శిక్షను ఈజిప్టు న్యాయస్థానం విధించింది. అంతేకాకుండా 3లక్షల ఈజిప్షియన్ పౌండ్లు (రూ.14లక్షలు) జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. ఈజిప్టుకు చెందిన బెల్లీ డాన్సర్ సామా ఎల్‌-మస్రీ టిక్‌టాక్, యూట్యూబ్‌లలో కొన్ని వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేసింది.

కాగా.. సదరు వీడియోలు అనుచితంగా ఉన్నాయని, లైంగిక సంప్రదాయాలను దెబ్బతీస్తూ విచ్చలవిడి తనాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నాయని ఆమెపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆమెను ఏప్రిల్ 23న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె పోలీస్ కస్టడీలోనే ఉంది. విచారణ అనంతరం కైరో న్యాయస్థానం ఎల్-మస్రీను దోషిగా పరిగణిస్తూ 3ఏళ్ల జైలుశిక్ష, రూ.14లక్షల జరిమానా విధించింది.

మరోవైపు.. ఎల్-మస్రీ స్పందిస్తూ తాను ఏ పాపం ఎరుగనని, తన మొబైల్‌లోని వీడియోలనూ, పొటోలనూ ఎవరో దొంగిలించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని వాపోయింది. దీనిపై పై కోర్టుకు వెళతానని, న్యాయం జరిగే వరకూ పోరాడతానని స్పష్టం చేసింది.