రాబర్ట్ వాద్రాకి ఈడీ షాక్!

| Edited By:

May 24, 2019 | 2:48 PM

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కాంగ్రెస్ నేత రాబర్ట్ వాద్రాకి షాక్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే వాద్రా ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మనీ ల్యాండరింగ్ కేసులో గతనెల 1వ తేదీన ట్రయల్ కోర్టు వాద్రాకి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి విదితమే. వాద్రాకు ఇచ్చిన ముందస్తు బెయిల్ వల్ల కేసు దర్యాప్తుకు నష్టం జరుగుతోందంటూ ఈడీ తరపు న్యాయవాది తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వాద్రాతో […]

రాబర్ట్ వాద్రాకి ఈడీ షాక్!
Follow us on

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కాంగ్రెస్ నేత రాబర్ట్ వాద్రాకి షాక్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే వాద్రా ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మనీ ల్యాండరింగ్ కేసులో గతనెల 1వ తేదీన ట్రయల్ కోర్టు వాద్రాకి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి విదితమే.

వాద్రాకు ఇచ్చిన ముందస్తు బెయిల్ వల్ల కేసు దర్యాప్తుకు నష్టం జరుగుతోందంటూ ఈడీ తరపు న్యాయవాది తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వాద్రాతో పాటు ఆయన సన్నిహితుడు మనోజ్ అరోరా ముందస్తు బెయిల్‌ను కూడా ఈడీ సవాల్ చేసింది. లండన్‌లో 1.9 మిలియన్ పౌండ్ల విలువైన ఓ భవంతి కొనుగోలులో అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారంటూ వాద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.