రైతు సెల్ఫీ వీడియో కలకలం… వారి వేధింపులు తాళలేక..!

|

May 24, 2020 | 12:49 PM

తూర్పుగోదావరి జిల్లా రౌతుల పూడి మండలం ములగపూడిలో గుడివాడ అప్పల నాయుడు అనే రైతు సెల్ఫీ వీడియో కలకలం రేపింది. కొంతమంది నాయకులు, పోలీసులు వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అప్పలనాయుడు. వీడియో వైర‌ల్ కావ‌డంతో..పోలీసులు అల‌ర్ట‌య్యారు. ఏలేరు కాలువ సమీపంలో గాలించ‌గా అప్పల నాయుడు బైక్, సూసైడ్ నోట్ లభ్యమ‌య్యాయి. అయితే అప్ప‌ల నాయుడు ఆచూకీ మాత్రం దొర‌క‌లేదు. దీంతో అత‌డి కోసం..ఏలేరు కాలువలో కుటుంబ […]

రైతు సెల్ఫీ వీడియో కలకలం... వారి వేధింపులు తాళలేక..!
Follow us on

తూర్పుగోదావరి జిల్లా రౌతుల పూడి మండలం ములగపూడిలో గుడివాడ అప్పల నాయుడు అనే రైతు సెల్ఫీ వీడియో కలకలం రేపింది. కొంతమంది నాయకులు, పోలీసులు వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అప్పలనాయుడు. వీడియో వైర‌ల్ కావ‌డంతో..పోలీసులు అల‌ర్ట‌య్యారు. ఏలేరు కాలువ సమీపంలో గాలించ‌గా అప్పల నాయుడు బైక్, సూసైడ్ నోట్ లభ్యమ‌య్యాయి. అయితే అప్ప‌ల నాయుడు ఆచూకీ మాత్రం దొర‌క‌లేదు. దీంతో అత‌డి కోసం..ఏలేరు కాలువలో కుటుంబ సభ్యులు, పోలీసులు గాలించ‌గా శంఖవరం మండలం అచ్చంపేట గ్రామంలో ఏలేరు కాలువ పక్కన సొమ్మసిల్లి పడి ఉన్న అప్పల నాయుడిని గుర్తించారు. దీంతో వెంట‌నే అతడిని రౌతులపూడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

స్థానిక వైసిపి నాయకుడు తంగేటి శివ గణేష్ తన స్థలంలో సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నాడంటూ ఆరోపించాడు రైతు. దీనిపై కోర్టు నుండి స్టే తెచ్చుకున్నాడు అప్పలనాయుడు. అయితే కోర్టు స్టే ఉంటుండగా శివ వర్గం ప‌నులు ప్రారంభించినట్టు తెలిపాడు. ప‌నులు అడ్డుకోబోయిన త‌న‌పై దాడికి పాల్ప‌డ్డార‌ని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే..వారు కూడా త‌న‌ను శారిరకంగా హింసించార‌ని చెప్పుకొచ్చాడు. దీనిపై కేసు నమోదు చేసిన కోటనందురు పోలీసులు‌ దర్యాప్తు చేస్తున్నారు.