కరోనా వేళ.. భయపెడుతున్న భూకంపాలు.. మొన్న ఢిల్లీ.. నేడు నేపాల్..

| Edited By:

May 13, 2020 | 4:30 PM

ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. మరోవైపు పలు దేశాలను ప్రకృతి కూడా భయపెడుతోంది. తాజాగా మొన్నటి వరకు పలుదేశాల్లో భారీ వర్షాలతో పాటు.. భూకంపాలు వణికించాయి. మన దేశంలో కూడా లాక్‌డౌన్ వేళ.. ఉత్తర భారతంలో పలుచోట్ల భూకంపాలు వచ్చాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో కూడా భూకంపం వణికించింది. తాజాగా నేపాల్‌లో కూడా మంగళవారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. […]

కరోనా వేళ.. భయపెడుతున్న భూకంపాలు.. మొన్న ఢిల్లీ.. నేడు నేపాల్..
Earthquake
Follow us on

ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. మరోవైపు పలు దేశాలను ప్రకృతి కూడా భయపెడుతోంది. తాజాగా మొన్నటి వరకు పలుదేశాల్లో భారీ వర్షాలతో పాటు.. భూకంపాలు వణికించాయి. మన దేశంలో కూడా లాక్‌డౌన్ వేళ.. ఉత్తర భారతంలో పలుచోట్ల భూకంపాలు వచ్చాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో కూడా భూకంపం వణికించింది. తాజాగా నేపాల్‌లో కూడా మంగళవారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. ఈ విషయాన్ని నేపాల్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ ప్రకటించింది. మంగళవారం రాత్రి 11.53 గంటల సమయంలో.. దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించిందని పేర్కొన్నారు. డొలాకా జిల్లాలోని జుగు ప్రాంతంలో.. ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఈ భూకంపం ధాటికి ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. దేశంలో కరోనా కేసులు కూడా మెల్లి మెల్లిగా పెరుగుతున్నాయి.