బ్రేకింగ్.. బోరబండలో కంపించిన భూమి

|

Oct 02, 2020 | 10:45 PM

హైదరాబాద్ బోరబండలో భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి నుంచి భారీ శబ్దాలు వెలువడ్డంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో జనమంతా ఇళ్లనుంచి బయటకు వచ్చి వీధుల్లోనికి పరుగులు తీశారు. సంవత్సరన్న క్రితం కూడా ఇదే విధంగా శబ్దాలతో భూమి కంపించిన సంగతిని స్థానికులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కంగారు పడాల్సిన అవసరంలేదని చెబుతున్నారు. భూ కంపనలకు సంబంధించి టివి9 తో (NGRI)భూకంప అధ్యయన హెచ్ వో డీ డాక్టర్ […]

బ్రేకింగ్.. బోరబండలో కంపించిన భూమి
Follow us on

హైదరాబాద్ బోరబండలో భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి నుంచి భారీ శబ్దాలు వెలువడ్డంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో జనమంతా ఇళ్లనుంచి బయటకు వచ్చి వీధుల్లోనికి పరుగులు తీశారు. సంవత్సరన్న క్రితం కూడా ఇదే విధంగా శబ్దాలతో భూమి కంపించిన సంగతిని స్థానికులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కంగారు పడాల్సిన అవసరంలేదని చెబుతున్నారు. భూ కంపనలకు సంబంధించి టివి9 తో (NGRI)భూకంప అధ్యయన హెచ్ వో డీ డాక్టర్ శ్రీనగేష్ మాట్లాడారు. బోరబండలో వచ్చిన శబ్దాలు భూకంపమేనన్నారు. బోరబండ సైట్ త్రీలో ప్రకంపనలు రేగాయని.. 1.4 తీవ్రతతో భూ కంపం వచ్చినట్లు ఎన్ జి ఆర్ ఐ గుర్తించిందని తెలిపారు. రాత్రి 8. 45 కి ఈ ప్రకంపనలు వచ్చినట్లు గుర్తించామని వెల్లడించారు.