డ‌న్జో కంపెనీ క‌స్ట‌మ‌ర్ల డేటా లీక్..!

|

Jul 12, 2020 | 4:10 PM

డెలివరీ సేవల స్టార్టప్..‌ డన్జోలో క‌స్ట‌మర్స్ డేటా హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని సంస్థ శనివారం తెలిపింది. ఆ సంస్థ వినియోగదారుల ఈమెయిల్‌ అడ్రస్‌లు, ఫోన్‌నంబర్లు లీకైనట్లు పేర్కొంది.

డ‌న్జో కంపెనీ క‌స్ట‌మ‌ర్ల డేటా లీక్..!
Follow us on

డెలివరీ సేవల స్టార్టప్..‌ డన్జోలో క‌స్ట‌మర్స్ డేటా హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని సంస్థ శనివారం తెలిపింది. ఆ సంస్థ వినియోగదారుల ఈమెయిల్‌ అడ్రస్‌లు, ఫోన్‌నంబర్లు లీకైనట్లు పేర్కొంది. థర్డ్‌పార్టీ పార్ట‌న‌ర్ సర్వర్‌ నుంచి ఇవి బయటకు వెళ్లినట్లు పేర్కొంది. కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ ముకుంద్‌ ఝా మాట్లాడుతూ… క‌స్ట‌మ‌ర్స్ పేమెంట్స్ చేసే కార్డుల నంబర్లు, ఇతర ప‌ర్స‌న‌ల్ డేటా లీక్‌ అయ్యే ఛాన్స్ లేదన్నారు. తాము అటువంటి డేటాను స్టోర్ చేయ‌మ‌ని తెలిపారు. ఈ డేటా లీక్‌ విషయం తెలియగానే తాము వెంటనే విరుగుడు చర్య‌లు తీసుకున్న‌ట్లు వివ‌రించారు. తమ క‌స్ట‌మ‌ర్స్ పాస్‌వర్డ్‌లు మార్చుకోవాల్సిన అవసరం లేదని.. వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌లతోనే యాప్‌ను ర‌న్ చేస్తున్న‌ట్లు తెలిపారు. క‌స్ట‌మ‌ర్స్ భ‌ద్ర‌త‌కు త‌మ కంపెనీ చాలా ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.

మొత్తం ఎంతమంది డేటా లీకైందో మాత్రం డన్జో తెలుప‌లేదు. క‌రోనా‌ విజృంభించాక హ్యకింగ్‌ కేసులు కూడా పెరుగుతున్నాయని అమెరికాకు చెందిన సైబర్‌ ఎర్లియర్ కంపెనీ వెల్ల‌డించింది. ఇటీవల కూడా ఇండియాబుల్స్ కంపెనీకి చెందిన కంప్యూటర్లపై సైబర్‌ దాడులు జరిగినట్లు ఇదే సంస్థ ప్ర‌క‌టించింది. ఈ దాడుల్లో హ్యాకర్లు కంపెనీకు చెందిన కీలక సమాచారాన్ని దొంగిలించారు.