ఈ సాయంత్రంతో ముగియనున్న దుబ్బాక ఎన్నికల ప్రచారం

|

Nov 01, 2020 | 8:06 AM

దుబ్బాకలో బై పోల్‌ ప్రచారం చివరి దశకు చేరింది. ఇవాళ సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు హోరాహోరీగా ఈ ఉదయం నుంచే చివరి అంకం ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అన్ని అస్త్రాలను ఉపయోగించి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. పార్టీల మధ్య విమర్శలు హద్దులు దాటుతున్నాయి. ఓట్లకోసం తమ రాజకీయాన్ని స్కీంల చుట్టూ తిప్పుతున్నాయి. వాటిపైనే నేతల మధ్య సవాళ్లు , ప్రతి సవాళ్లతో రచ్చ రచ్చ జరుగుతోంది. ఇక, ప్రచార హోరు […]

ఈ సాయంత్రంతో ముగియనున్న దుబ్బాక ఎన్నికల ప్రచారం
Follow us on

దుబ్బాకలో బై పోల్‌ ప్రచారం చివరి దశకు చేరింది. ఇవాళ సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు హోరాహోరీగా ఈ ఉదయం నుంచే చివరి అంకం ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అన్ని అస్త్రాలను ఉపయోగించి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. పార్టీల మధ్య విమర్శలు హద్దులు దాటుతున్నాయి. ఓట్లకోసం తమ రాజకీయాన్ని స్కీంల చుట్టూ తిప్పుతున్నాయి. వాటిపైనే నేతల మధ్య సవాళ్లు , ప్రతి సవాళ్లతో రచ్చ రచ్చ జరుగుతోంది. ఇక, ప్రచార హోరు ఇవాళ్టితో ముగియనుండటంతో..ఇక సవాళ్లు, ప్రతి సవాళ్లు కనిపించవు. మరి కొన్ని గంటల్లో మైకులు మూగబోనున్నాయి. ఈ నేపథ్యంలో గెలవడానికి అన్ని పార్టీలు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నాయి. ట్రయాంగిల్‌ వార్‌లో విజయం కోసం పార్టీలు చేయని ప్రయత్నాలు లేవు. జనాన్ని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలంతా దుబ్బాకలోనే తిష్టవేసి…ప్రచారం నిర్వహిస్తున్నారు.