ఎయిర్ ఇండియా విమానాలను రావద్దన్న దుబాయ్

|

Sep 18, 2020 | 1:16 PM

ఎయిర్ ఇండియా విమానాలకు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ బ్రేక్ వేసింది. రెండు వారాలపాటు ఇండియా విమానాల రాకపోకలపై నిషేధం విధించింది.

ఎయిర్ ఇండియా విమానాలను రావద్దన్న దుబాయ్
Follow us on

ఎయిర్ ఇండియా విమానాలకు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ బ్రేక్ వేసింది. రెండు వారాలపాటు ఇండియా విమానాల రాకపోకలపై నిషేధం విధించింది.. గత రెండు వారాల్లో కొవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్లతో ప్రయాణికులను రెండుసార్లు తీసుకువచ్చినట్లు దుబాయ్ ఎయిర్ ఫోర్టు అథారిటీ తెలిపింది. దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను అక్టోబరు 2వతేదీ వరకు నిలిపివేస్తున్నట్లు దుబాయ్ ప్రభుత్వ సీనియర్ అధికారులు శుక్రవారం చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిబంధనల ప్రకారం భారతదేశం నుంచి ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు కొవిడ్ టెస్టు రిపోర్టు సమర్పించాలని కోరింది. తన ప్రయాణానికి 96 గంటల ముందు చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకొని కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించింది.

కొవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్ ఉన్న ఓ ప్రయాణికుడు సెప్టెంబరు 4వతేదీన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్‌లో జైపూర్ నుంచి దుబాయ్ విమానంలో ప్రయాణించారు. ఇంతకు ముందు దుబాయ్ విమానాల్లో ఇలాంటి ఘటన జరిగింది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణికులను చేరవేసినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ పేర్కొంది. దీంతో సెప్టెంబరు 18వతేదీ నుంచి అక్టోబరు 2వతేదీ వరకు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఎయిర్ ఇండియా విమానాల్లో కొవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్లతో ప్రయాణించిన సంఘటనలు పలుమార్లు ఉల్లంఘించినందువల్ల దుబాయ్ పౌరవిమానయాన శాఖ ఈ ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలను నిలిపివేసింది. 15 రోజుల పాటు ఈ నిషేధం అమలులో ఉంటుందని అధికారుల పేర్కొన్నారు.