డెలివరీ కోసం పుట్టింటికి భార్య.. దుబాయ్ లో భర్తకి గుండెపోటు..!

|

Jun 09, 2020 | 3:08 PM

నిండు గర్భిణి అయిన భార్యను పుట్టింటికి పంపి దుబాయ్ లో గుండెపోటుతో మృతిచెందాడు ఓ యువకుడు

డెలివరీ కోసం పుట్టింటికి భార్య.. దుబాయ్ లో భర్తకి గుండెపోటు..!
Follow us on

దుబాయ్ లో విషాదం చోటుచేసుకుంది. నిండు గర్భిణి అయిన భార్యను పుట్టింటికి పంపి గుండెపోటుతో మృతిచెందాడు ఓ యువకుడు. కేరళకు చెందిన నితిన్ చంద్రన్(28) దుబాయ్‌లోని ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య అతిరా గీతా శ్రీధరన్(27) ప్రస్తుతం 8 నెలల గర్భవతి. అయితే లాక్ డౌన్ కారణంగా దుబాయ్ లోనే దంపతులిద్దరు ఉండిపోయారు. నెలలు నిండిని భార్యను ఎలాగైనా ఇండియాకి పంపించాలని భావించాడు. ఇందుకు కొవిడ్ నిబంధనలు అడ్డుపడ్డాయి. చివరికి కేంద్రం తీసుకున్న నిర్ణయం వారికి కలిసివచ్చింది. కరోనా లాక్ డౌన్ తో విదేశాలలో చిక్కుకున్న వారిని భారత్‌కు రప్పించేందుకు ‘వందే భారత్ మిషన్’చేపట్టింది. దీంతో డెలివరీ కోసం గీతాను మే 7న చంద్రన్ కేరళాకు పంపించాడు.
అయితే, నితిన్ చంద్రన్ మాత్రం దుబాయ్ లోనే ఉద్యోగ పనుల రీత్యా అక్కడే ఉండిపోయాడు. సోమవారం రాత్రి నిద్రలో ఉండగా చంద్రన్‌కు బీపీ పెరిగి గుండెపోటు వచ్చింది. దీంతో చంద్రన్ నిద్రలోనే చనిపోయాడని వైద్యులు ధృవీకరించారని చంద్రన్ స్నేహితుడు తెలిపాడు. మరోవైపు శ్రీధర్ మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని కుటుంబసభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కడసారి చూపు కల్పించాలని వేడుకుంటున్నారు. ఇందుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.