డ్రోన్లను అడ్డుకునే సత్తా ఎన్ఎస్ గార్డ్సుకు ఉందిః దేస్వాల్

|

Oct 17, 2020 | 11:22 AM

గత కొద్దిరోజులుగా సరిహద్దులో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. అక్రమార్కులు డ్రోన్ల సాయంతో దేశంలోకి చొరబాట్లకు యత్నిస్తున్నారు. ఉగ్రవాదులు ఆయుధాలతో పాటు మాదకద్రవ్యాలు అక్రమంగా తరలిస్తున్నారు.

డ్రోన్లను అడ్డుకునే సత్తా ఎన్ఎస్ గార్డ్సుకు ఉందిః దేస్వాల్
Follow us on

గత కొద్దిరోజులుగా సరిహద్దులో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. అక్రమార్కులు డ్రోన్ల సాయంతో దేశంలోకి చొరబాట్లకు యత్నిస్తున్నారు. ఉగ్రవాదులు ఆయుధాలతో పాటు మాదకద్రవ్యాలు అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై సరిహద్దు భద్రత సిబ్బంది స్పందించింది. దేశ సరిహద్దుల్లో డ్రోన్లను అడ్డుకునే సత్తా నేషనల్ సెక్యూరిటీ గార్డులకు ఉందని ఆ సంస్థ డైరెక్టరు జనరల్ ఎస్ఎస్ దేస్వాల్ చెప్పారు. దేశ సరిహద్దుల వద్ద డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదకద్రవ్యాలను మనదేశంలో వదలడానికి ఉపయోగిస్తున్నారని దేస్వాల్ చెప్పారు. సరిహద్దుల్లో డ్రోన్లను గుర్తించి వాటిని ధ్వంసం చేసే వ్యవస్థ నేషనల్ సెక్యూరిటీ గార్డుల వద్ద ఉందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద భద్రతా ముప్పు ఉన్నందున తాము అప్రమత్తంగా ఉన్నామని దేస్వాల్ స్పష్టం చేశారు. సరిహద్దుల మీదుగా డ్రోన్ల సాయంతో ఆయుధాలు, మాదకద్రవ్యాలు మన దేశంలోకి రాకుండా నివారిస్తామని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేస్వాల్ వెల్లడించారు.