డీఆర్‌డీవో సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

|

May 23, 2020 | 6:09 PM

ఇంజనీరింగ్ నిరుద్యోగ యువకులకు గుడ్ న్యూస్. రక్షణ రంగంలో ఉద్యోగాల నియామకానికి ప్రకటన వెలువడింది. డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ డీఆర్‌డీవో సైంటిస్ట్‌ బీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మే 29 నుంచి ప్రారంభం కానుంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 185 సైటిస్ట్‌ బీ పోస్టు భర్తీకి డీఆర్‌డీవో నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ […]

డీఆర్‌డీవో సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Follow us on

ఇంజనీరింగ్ నిరుద్యోగ యువకులకు గుడ్ న్యూస్. రక్షణ రంగంలో ఉద్యోగాల నియామకానికి ప్రకటన వెలువడింది. డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ డీఆర్‌డీవో సైంటిస్ట్‌ బీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మే 29 నుంచి ప్రారంభం కానుంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 185 సైటిస్ట్‌ బీ పోస్టు భర్తీకి డీఆర్‌డీవో నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల దృష్ట్యా మే 29కి వాయిదా వేసింది. డీఆర్‌డీవో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ చెందిన 41 పోస్టులు, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చెందిన 43, కంప్యూటర్‌ సైన్స్‌ చెందిన 32, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ సంబంధించి 12, మెటల్లర్జి విభాగంలో 10, ఫిజిక్స్‌-8, కెమిస్ట్రీ-7, కెమికల్‌ ఇంజినీరింగ్‌-6, ఎరోనాటికల్‌ ఇంజినీరింగ్‌-9, సివిల్‌ ఇంజినీరింగ్‌-3, మ్యాథమెటిక్స్‌-4, సైకాలజీ-10 విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్‌, పోస్టుగ్రాడ్యుయేట్‌ పూర్తిచేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా గేట్‌, నెట్‌ స్కోర్‌ కలిగి ఉండాలి.