డెహ్రాడూన్ లో ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చిన రైలు

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:44 PM

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ లో డూన్ ఎక్స్ ప్రెస్ బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో రైలు ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చింది. దీంతో ఫ్లాట్ ఫామ్ ధ్వంసమైంది. డెహ్రాడూన్ రైల్వేస్టేషన్లె ఫ్లాట్ ఫామ్ పై ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రయాణికులకు పెనుముప్పు తప్పింది. లేదంటే భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగేదని రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. దీనిపై రైల్వేశాఖ దర్యాప్తుకు ఆదేశించింది. బ్రేకులు ఫేయిల్ కావడంతోనే ఈ […]

డెహ్రాడూన్ లో ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చిన రైలు
Follow us on

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ లో డూన్ ఎక్స్ ప్రెస్ బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో రైలు ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చింది. దీంతో ఫ్లాట్ ఫామ్ ధ్వంసమైంది. డెహ్రాడూన్ రైల్వేస్టేషన్లె ఫ్లాట్ ఫామ్ పై ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రయాణికులకు పెనుముప్పు తప్పింది. లేదంటే భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగేదని రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. దీనిపై రైల్వేశాఖ దర్యాప్తుకు ఆదేశించింది. బ్రేకులు ఫేయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని డూన్ ఎక్స్ ప్రెస్ డ్రైవర్ తెలిపాడు. అదుపు తప్పి ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చినట్లు తెలిపాడు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు తగులలేదు.