AP Local Body Elections: “ప్రలోభ పెట్టేందుకు మా ఇంటికి రావొద్దు”.. ఎన్నికల వేళ వైరలవుతున్న ఫ్లెక్సీ

|

Feb 17, 2021 | 9:04 AM

ఏపీ పంచాయతీ ఎన్నికలు చర్చనీయాంశమవుతున్నాయి. ఈ సారి ఎన్నో ఆసక్తికర ఘటనలు, వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. వినూత్న ప్రచారాలతో పాటే...

AP Local Body Elections: ప్రలోభ పెట్టేందుకు మా ఇంటికి రావొద్దు.. ఎన్నికల వేళ వైరలవుతున్న ఫ్లెక్సీ
Follow us on

ఏపీ పంచాయతీ ఎన్నికలు చర్చనీయాంశమవుతున్నాయి. ఈ సారి ఎన్నో ఆసక్తికర ఘటనలు, వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. వినూత్న ప్రచారాలతో పాటే, తమదైన స్టైల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు బరిలో నిలిచిన అభ్యర్థులు. ఈ క్రమంలోనే…ప్రలోభాలకు ప్రయత్నించే పోటీదారులకు షాక్‌ ఇచ్చేలా పశ్చిమగోదావరి జిల్లా కన్నాపురం సెంటర్లో వెలసిన ఓ ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది.

పంచాయతీ ఎన్నికలు అంటే సాధరణంగా గ్రామాల్లో భారీగా ప్రలోభాలు ఉంటాయి. ఇంటికి ఇంత.. ఓటుకు ఇంత అని పోలింగ్ సమయం వరకు పంచుతూనే ఉంటారు. అందుకే ఇక్కడి ఓటర్లు ఇలాంటి వినూత్న ప్రయోగం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు..ప్రలోభపెట్టేందుకు మా ఇంటికి రావొద్దంటూ ఇలా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

మరోవైపు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు పంచాయతీ ఎన్నికలపై తమ ఆధిక్యాన్ని ప్రదర్శించాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు. అటు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల అధికారులు సైతం పటిష్ట ఏర్పాట్లు చేశారు.

Also Read:

AP Panchayat Elections 2021 live: ఏపీలో మొదలైన మూడో విడత పంచాయతీ ఎన్నికలు.. తేలనున్న 51,369 మంది అభ్యర్థుల భవితవ్వం..