ట్రంప్ మధ్యవర్తిత్వమా.. వాట్ ఈజ్ దిస్

| Edited By:

Aug 22, 2019 | 2:32 AM

కశ్మీర్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి విస్మయానికి గురిచేస్తోంది. భారత్-పాక్‌ల మధ్య నెలకొన్ని వివాదం నేపథ్యంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. అదే విధంగా ఆయన పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో కూడా మాట్లాడారు. ఇప్పుడు తాజాగా ఇరు దేశాల మధ్య మధ్య వర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమంటూ ప్రకటించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలతోనే కశ్మీర్ సంక్షోభానికి […]

ట్రంప్ మధ్యవర్తిత్వమా.. వాట్ ఈజ్ దిస్
Follow us on

కశ్మీర్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి విస్మయానికి గురిచేస్తోంది. భారత్-పాక్‌ల మధ్య నెలకొన్ని వివాదం నేపథ్యంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. అదే విధంగా ఆయన పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో కూడా మాట్లాడారు. ఇప్పుడు తాజాగా ఇరు దేశాల మధ్య మధ్య వర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమంటూ ప్రకటించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలతోనే కశ్మీర్ సంక్షోభానికి తెరపడుతుందని, రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పడం ఇబ్బందికరంగా మారింది.

ఎన్‌బీసీ న్యూస్ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. ‘‘కశ్మీర్ అంశం చాలా క్లిష్టమైనది. అక్కడ హిందువులు, ముస్లింల మధ్య సంబంధాలు మంచిగా లేవు. పరిస్థితులు చేజారకముందే ఈ సమస్య పరిష్కారం కావాలి. కశ్మీర్‌లో శాంతి నెలకొనేలా సహాయపడేందుకు నేను సిద్ధమంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే అమెరికా జోక్యం తమకు అవసరం లేదని, ఇది తమ అంతర్గత వ్యవహారమని భారత్ ఇంతకుముందే స్పష్టం చేసింది.