Sneezing : తుమ్ము తక్కువ దేమీ కాదు.. బొక్కలు ఇరుగు ​ బాసూ! అసలు ఇది ఎందుకొస్తుందో తెలుసా..

|

Jan 07, 2021 | 10:33 PM

Sneezing : తుమ్మును మన దేశంలో అరిష్టంగా భావిస్తారు. ఇంట్లో నుంచి బయటకెళ్తున్నప్పుడు ఎవరైనా తుమ్మితే చాలు ఇక రెండు నిమిషాలు ఇంట్లో కూర్చుని వెళ్లాల్సిందే.

Sneezing : తుమ్ము తక్కువ దేమీ కాదు.. బొక్కలు ఇరుగు ​ బాసూ! అసలు ఇది ఎందుకొస్తుందో తెలుసా..
Follow us on

Sneezing : తుమ్మును మన దేశంలో అరిష్టంగా భావిస్తారు. ఇంట్లో నుంచి బయటకెళ్తున్నప్పుడు ఎవరైనా తుమ్మితే చాలు ఇక రెండు నిమిషాలు ఇంట్లో కూర్చుని వెళ్లాల్సిందే. శుభకార్యాలు, పూజా కార్యక్రమాల ముందు ఎవరైనా తుమ్మినా వినపడకుండా బ్యాండ్​ లేదా డప్పు సౌండ్​ పెంచుతారు. ఇక చిన్న పిల్లలనైతే ముందే హెచ్చరిస్తారు.. తుమ్మొస్తే ముక్కు నలుచుకోమని!. ఏదైనా బయటి పదార్థం ముక్కులోకి ప్రవేశించినప్పుడు ఆ పదార్థం ముక్కులో ఇరుక్కొని ముక్కునుంచి మస్తిష్కానికి(బ్రెయిన్​కు) ఓ సందేశం అందుతుంది. శరీరానికి పనికిరాని పదార్థాన్ని(చెడు పదార్థం) వెంటనే బయటకు పంపేయండి అంటూ మస్తిష్కం శరీరంలోని కండరాలను ఆదేశిస్తుంది.

తుమ్ములాంటి చిన్న ప్రక్రియలో కూడా శరీరంలోని ఎన్నో భాగాలు పనిచేస్తాయి. అవి కడుపు, రొమ్ము, డయాఫ్రమ్, స్వరపేటిక, గొంతు వెనుకభాగం, ఇంకా కండ్లు కూడా పనిచేస్తాయి. ఇవన్నీ కలిసి కట్టుగా పనిచేసి బయటినుంచి వచ్చిన పనికిరాని పదార్థాన్ని వెంటనే తుమ్ము ద్వారా బయటకు పంపివేస్తాయి. కొన్ని సందర్భాలలో ఒక తుమ్ముతో పని జరగకపోతే మళ్లీ మళ్లీ ఆగకుండా వస్తుంటాయి. ఆ పనికిరాని పదార్థం బయటకు రానంతవరకు తుమ్ములు వస్తూనే ఉంటాయి. తుమ్ము మీద ఓ మహానుభావుడికి డౌట్​ వచ్చింది. ఓ ప్రయోగం చేద్దామనుకున్నాడు. అదేంటంటే ముక్కు, నోరు మూసుకుని తుమ్మితే ఏమవుతుందో చూద్దామనుకున్నాడు. ముక్కు, నోరు మూసుకుని గట్టిగా తుమ్మాడు. వెంటనే ఫట్​ మని మెడలో ఎముక విరిగిన శబ్దం వచ్చింది. ఆతర్వాత నోట్లోంచి రక్తం రావడంతో పాటు వాయిస్​ మారిపోయింది. దీంతో భయం భయంగా హాస్పిటల్​కు వెళ్లాడు. అతడి మెడ ఎముక పక్కకు కదిలి విరగడంతో పాటు గొంతులో లోతైన కణజాలం, కండరాల లోపల గాలి బుడగలు వచ్చినట్లు డాక్టర్లు గుర్తించారు.

ఢిల్లీలో ‘కూర్చుని వ్యవసాయం చేస్తామంటే ఎలా ?’ కేంద్రంపై ఎన్సీపీ నేత శరద్ పవార్ సెటైర్, మేం చేసినట్టు చేయాలనీ సూచన

యాభై ఎకరాల పొలాన్ని పేకాటలో తగలెట్టాడు, చివరికి వ్యసనాన్ని వీడలేక దొంగగా మారి..