ఖాళీ బాటిళ్లలో పెట్రోలు నింపారో..బంకులపై పోలీస్ నజర్

|

Dec 02, 2019 | 5:43 PM

ఇటీవల కాలంలో మహిళలపై వరుస దాడులు కలవరపెడుతున్నాయి. వావి, వరసలు లేకుండా వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు మృగాళ్లు. మరోవైపు పెట్రోల్, కిరోసిన్‌తో అటాక్ చేస్తూ.. సజీవ దహనాలకు యత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మార్వో విజయా రెడ్డి సజీవ దహనం, దిశపై హత్యాచారం చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టడం వంటి ఘటనలతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇకపై ఖాళీ బాటిళ్లలో పెట్రోల్, డిజిల్ లాంటివి పోస్తే..భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బంకు యజమానులను హెచ్చరిస్తున్నారు. ఈమేరకు […]

ఖాళీ బాటిళ్లలో పెట్రోలు నింపారో..బంకులపై పోలీస్ నజర్
Follow us on

ఇటీవల కాలంలో మహిళలపై వరుస దాడులు కలవరపెడుతున్నాయి. వావి, వరసలు లేకుండా వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు మృగాళ్లు. మరోవైపు పెట్రోల్, కిరోసిన్‌తో అటాక్ చేస్తూ.. సజీవ దహనాలకు యత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మార్వో విజయా రెడ్డి సజీవ దహనం, దిశపై హత్యాచారం చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టడం వంటి ఘటనలతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇకపై ఖాళీ బాటిళ్లలో పెట్రోల్, డిజిల్ లాంటివి పోస్తే..భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బంకు యజమానులను హెచ్చరిస్తున్నారు. ఈమేరకు శంషాబాద్  జోన్ పరిధిలోని అన్ని పెట్రోలు బంక్‌లకు నోటీసులను జారీ చేస్తున్నామని తెలిపారు  డీసీపీ ప్రకాశ్‌రెడ్డి.

ఒకవేళ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు ఆ బాటిల్ తీసుకువచ్చిన వారి పేరు, వారి వాహనం నెంబర్, ఫోన్ నెంబర్ తదితర వివరాలతో పాటు సదరు వ్యక్తుల ఫోటోలు సైతం స్మార్ట్ ఫోన్స్‌లో సేవ్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.  వీటిపై త్వరలోనే బంకు యజయానులకు, సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విజయా రెడ్డి ఘటన అనంతరం ప్లాస్టిక్ బాటిల్స్‌లో పెట్రోల్ నింపొద్దంటూ  తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసు డిపార్ట్‌మెంట్ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక దిశ ఘటనలో నిందితులకు బాటిల్‌లో పెట్రోల్ ఫిల్ చేసిన బంక్ సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు న్యాయ సలహా కోరారు.