”ఆయన స్వరం.. సంగీతం ఉన్నంత కాలం బ్రతికే ఉంటుంది”

|

Sep 25, 2020 | 5:30 PM

ఆ గానం మూగబోయింది. పాడుతా తీయగా అంటూ పాడిన ఆయన స్వరం మన చెవుల నుంచి దూరంగా వెళ్లింది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన గాన గంధర్వుడు పరలోక పయనమయ్యాడు.

ఆయన స్వరం.. సంగీతం ఉన్నంత కాలం బ్రతికే ఉంటుంది
Follow us on

ఆ గానం మూగబోయింది. పాడుతా తీయగా అంటూ పాడిన ఆయన స్వరం మన చెవుల నుంచి దూరంగా వెళ్లింది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన గాన గంధర్వుడు పరలోక పయనమయ్యాడు. ఆయన తిరిగి రావాలంటూ దేశవ్యాప్తంగా చేసిన ప్రార్థనలు ఫలించలేదు. గానగంధర్వుడు, పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇవాళ మధ్యాహ్నం 1.04 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. దీంతో యావత్ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గాన గంధర్వునికి నివాళులు చెబుతూ సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఎస్పీ బాలు మృతికి దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. (SP Balu Passes Away)

బ్రతకడం కాదు.. ఇతరులకు ఉపయోగపడేలా బ్రతకడం గొప్ప. భౌతికంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దూరమయ్యారు. కానీ ఆయన గళం సంగీతం ఉన్నంత కాలం బతికే ఉంటుంది” అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.