అందుకే ఆ పదవికి దరఖాస్తు చేయలేదు: రఘు రామ్ రాజన్

| Edited By:

Jul 22, 2019 | 8:55 AM

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(బీసీఈ)గవర్నర్ రేసులో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చినట్లు తెలిసిందే. అయితే ఈ పదవిని తాను స్వీకరించేందుకు తాను సుముఖంగా లేనని ఆయన స్పష్టం చేశారు. బ్రిగ్జిట్ నేపథ్యంలో బీఓఈపై తీవ్ర రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉందని.. అందుకే ఆ పదవికి తాను దరఖాస్తు చేసుకోవడం లేదని రాజన్ వెల్లడించారు. బ్రిటన్ రాజకీయాలపై తనకు లోతైన అవగాహన లేదని.. ఆ దేశ రాజకీయాలపై పూర్తిగా […]

అందుకే ఆ పదవికి దరఖాస్తు చేయలేదు: రఘు రామ్ రాజన్
Former RBI governor Raghuram Rajan
Follow us on

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(బీసీఈ)గవర్నర్ రేసులో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చినట్లు తెలిసిందే. అయితే ఈ పదవిని తాను స్వీకరించేందుకు తాను సుముఖంగా లేనని ఆయన స్పష్టం చేశారు. బ్రిగ్జిట్ నేపథ్యంలో బీఓఈపై తీవ్ర రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉందని.. అందుకే ఆ పదవికి తాను దరఖాస్తు చేసుకోవడం లేదని రాజన్ వెల్లడించారు. బ్రిటన్ రాజకీయాలపై తనకు లోతైన అవగాహన లేదని.. ఆ దేశ రాజకీయాలపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి అయితేనే ఆ బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించగలరని ఆయన అన్నారు. ఇప్పుడు పలు దేశాల కేంద్ర బ్యాంకు వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోతుందని రాజన్ అభిప్రాయపడ్డారు.

అయితే ప్రస్తుతం బీఓఈ గవర్నర్‌గా మార్క్ క్యార్నీ పదవీకాలం జనవరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన వారసుడగా.. అంతర్జాతీయ స్థాయి అనుభవం ఉన్న వ్యక్తిని నియమించాలని బ్రిటన్ భావిస్తోంది. కాగా ఈ పదవి కోసం 30మంది పోటీలో ఉన్నట్లు సమాచారం.