షుగర్ పేషెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై రైస్ తినొచ్చు..!

|

May 20, 2020 | 6:02 PM

షుగర్ పెషేంట్స్ ఏం తినాలన్న భయంతో వణికిపోతారు. నోరు తినాలని ఉన్న ఎక్కడ గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయోనని జంకుతారు. ఇకపై ఆ భయం అక్కర్లేదంటున్నారు తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు. గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉండే తెలంగాణ సోనా రకం బియ్యంతో అన్నం తినొచ్చంటున్నారు. రోజు కష్టం చేసిన తర్వాత ఇంత ముద్ద దిగనిదే శరీరం కుదుటపడదు. షుగర్ పెషేంట్స్ అయితే నోటికి తాళం వేసుకుని ఆహార అలవాట్లను మార్చుకుంటారు. లేదంటే అన్నం తింటే బ్లడ్ లో షుగర్ […]

షుగర్ పేషెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై రైస్ తినొచ్చు..!
Follow us on

షుగర్ పెషేంట్స్ ఏం తినాలన్న భయంతో వణికిపోతారు. నోరు తినాలని ఉన్న ఎక్కడ గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయోనని జంకుతారు. ఇకపై ఆ భయం అక్కర్లేదంటున్నారు తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు. గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉండే తెలంగాణ సోనా రకం బియ్యంతో అన్నం తినొచ్చంటున్నారు.

రోజు కష్టం చేసిన తర్వాత ఇంత ముద్ద దిగనిదే శరీరం కుదుటపడదు. షుగర్ పెషేంట్స్ అయితే నోటికి తాళం వేసుకుని ఆహార అలవాట్లను మార్చుకుంటారు. లేదంటే అన్నం తింటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. తినకుంటే ఏదో వెలితి. అన్ని రకాల సన్న బియ్యంతోనూ ఇదే సమస్య. తెలంగాణ సోనా రకంతో ఈ ఇబ్బంది ఉండదని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. తెలంగాణ సోనా రకం (RNR 15048) బియ్యం తిన్న తర్వాత బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగడంలేదని, గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువే ఉంటోందంటున్నారు. కానీ వైద్యులు మాత్రం ఈ అంశాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

షుగర్ ఫ్రీ రైస్ గా పేరు తెచ్చుకున్న ఈ రకం బియ్యానికి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ బాగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఈ రకం వరిని పండించేందుక రైతులు సైతం మొగ్గుచూపుతున్నారు. తెలంగాణ సోనా (RNR 15048) ఇప్పుడు సన్న బియ్యం రకాల్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. షుగర్ ఫ్రీ రైస్ బ్రాండ్ గా మారడం, మిగతా సన్న రకం విత్తనాలతో పోల్చితే పెట్టుబడి ఖర్చు తక్కవతుండడంతో పాటు తక్కువ కాలంలోనే పంట చేతికొస్తోంది. అంతే కాకుండా అన్ని కాలాల్లోనూ సాగుకి అనుకూలం. దీంతో ఈ రకం వరి పంట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మూడేండ్ల క్రితం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన తెలంగాణ సోనా సాగు.. ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించింది.

తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం వానకాలంలో 40 లక్షల ఎకరాలు, యాసంగిలో 40 లక్షల ఎకరాలు ఉంటోంది. ప్రస్తుత ఏడాదిలో 8 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా సాగైంది. వచ్చే ఏడాది ఒక్క వానాకాలంలోనే 10 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సన్న రకం వడ్లను మిల్లింగ్ చేస్తే నార్మల్ గా 50 నుంచి 60 కిలోల బియ్యమే వస్తాయి. నూకల శాతం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ సోనా రకమైతే 68 నుంచి 70 కిలోల వరకు బియ్యం వస్తాయంటున్నారు రైతులు. తెలంగాణ సోనా రకం 20 రోజులు తక్కువ పంట కావడం వల్ల ఫెర్టిలైజర్ వాడకం కూడా తక్కువే.

బీపీటీ 5204 రకంలో గ్లైసెమిక్ ఇండెక్స్ 56.50 శాతం ఉంటే.. తెలంగాణ సోనాలో ఇది 51 శాతమే. అన్నం క్వాలిటీని తెలిపే గంజి శాతం(అమైలోజ్) కూడా తెలంగాణ సోనాలో 20.72 శాతం ఉంటే.. మిగిలిన సన్న రకాల బియ్యంలో 27 శాతం వరకు ఉంటుంది. సాధారణ రకంలో ప్రొటీన్ 7–8 శాతం ఉంటే.. తెలంగాణ సోనాలో 8.76 శాతం ఉందంటున్నారు న్యూట్రిషన్ నిపుణులు.