రోగాల్లో.. భారతదేశమే టాప్‌..? కారణాలివే..!!

| Edited By:

Nov 01, 2019 | 10:43 AM

ఇండియాలో ఏం జరుగుతోంది..? భారతదేశంలోని ప్రజలంతా.. రోగాల బారిన పడుతున్నారా..? అవునా అంటే.. నిజమనే చెబుతున్నాయి తాజా లెక్కలు. ఈ విషయాలను స్వయంగా.. ఆరోగ్య మంత్రిత్వ శాఖనే విడుదల చేసింది. ముఖ్యంగా.. జనాలు.. బీపీ, షుగర్లు, క్యాన్సర్ వంటి రోగాలతోనే ఎక్కువగా పోరాడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు భారత్‌లో ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా.. బీపీ, షుగర్లు, క్యాన్సర్‌ వంటి రోగాలు ఇండియాలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. 2018లలో స్టేట్ రన్ ఎన్‌సీడీ క్లినికల్ లెక్కల ప్రకారం.. 6.51 […]

రోగాల్లో.. భారతదేశమే టాప్‌..? కారణాలివే..!!
Follow us on

ఇండియాలో ఏం జరుగుతోంది..? భారతదేశంలోని ప్రజలంతా.. రోగాల బారిన పడుతున్నారా..? అవునా అంటే.. నిజమనే చెబుతున్నాయి తాజా లెక్కలు. ఈ విషయాలను స్వయంగా.. ఆరోగ్య మంత్రిత్వ శాఖనే విడుదల చేసింది. ముఖ్యంగా.. జనాలు.. బీపీ, షుగర్లు, క్యాన్సర్ వంటి రోగాలతోనే ఎక్కువగా పోరాడుతున్నారు.

దీర్ఘకాలిక వ్యాధులు భారత్‌లో ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా.. బీపీ, షుగర్లు, క్యాన్సర్‌ వంటి రోగాలు ఇండియాలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. 2018లలో స్టేట్ రన్ ఎన్‌సీడీ క్లినికల్ లెక్కల ప్రకారం.. 6.51 కోట్లలో.. 40 లక్షలకు పైగా రక్తపోటు, 31 లక్షలకు పైగా డయాబెటీస్ ఉన్నట్లు గుర్తించగా.. ఏకంగా 11 లక్షల మంది ప్రజలు ఈ రెండిటితోనూ బాధపడుతున్నారు. అంతేకాకుండా.. మరో 2 లక్షల మంది గుండె జబ్బులతో బాధపడగా.. 1.68 లక్షల మంది సాధారణ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఆరోగ్య మంత్రి శాఖ అధికారులు తెలిపారు. ఈ రకరకాల జబ్బుల గురించి తెలుసుకునే లోపే.. వారి జీవితం ముగిస్తుంది.

కారణాలివే:

  • కాలుష్యం
  • జంక్‌ ఫుడ్‌ని ఎక్కువగా తినడం
  • స్మార్ట్ ఫోన్ల వినియోగం
  • ధూమ పానం, మద్యపానం
  • సమయానికి తినకపోవడం
  • అధిక నిద్ర
  • అతి నిద్ర
  • ఎక్కువగా వర్క్ చేయడం