Best of 2020: ట్విట్టర్‌లో దుమ్మురేపుతున్న ధోనీ, కోహ్లీ.. రికార్డు సృష్టించిన ధోనీ రిప్లే..

|

Dec 14, 2020 | 7:39 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహీకి అభినందనలు తెలుపుతూ ప్రధాని మోదీ రెండు పేజీల లేఖను రాసారు. ప్రధాని రాసిన లేఖపై ధోనీ కూడా స్పందించారు. ఆర్టిస్ట్, సైనికుడు, క్రీడాకారుడు కోరుకునేది ఇలాంటి ప్రశంసలేనని..

Best of 2020: ట్విట్టర్‌లో దుమ్మురేపుతున్న ధోనీ, కోహ్లీ.. రికార్డు సృష్టించిన ధోనీ రిప్లే..
Follow us on

టీమిండియా ఆటగాళ్లు క్రికెట్ మైదానంలోనే కాదు సామాజిక మాధ్యమాల్లోనూ దుమ్మురేపుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ట్విటర్‌లో దుమ్మురేపారు. ఈ ఏడాది ట్విటర్‌ వేదికగా ఎక్కువ చర్చించిన భారత ఆటగాళ్లలో ఈ ముగ్గురూ టాప్‌లో నిలిచారు.

ఇక మహిళల క్రీడాకురుల నుంచి రెజ్లర్ గీతా ఫోగట్, పీవీ సింధు, సైనా నెహ్వాల్ టాప్-3లో చోటు దక్కించుకున్నారు. టీమిండియా కెప్టెన్‌గా విరాట్ తరుచూ వార్తల్లో నిలవగా.. అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్, ఐపీఎల్ 2020 సీజన్‌తో ధోనీ పేరు మారుమోగింది. ఇక గాయం, ఐపీఎల్ టైటిల్‌తో రోహిత్ పేరు చర్చనీయాంశమైంది.

ఇదిలావుంటే.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహీకి అభినందనలు తెలుపుతూ ప్రధాని మోదీ రెండు పేజీల లేఖను రాసారు. ప్రధాని రాసిన లేఖపై ధోనీ కూడా స్పందించారు. ఆర్టిస్ట్, సైనికుడు, క్రీడాకారుడు కోరుకునేది ఇలాంటి ప్రశంసలేనని.. మోదీకి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. ఈ రీట్వీట్ ట్విటర్‌లో పెద్ద రికార్డును సృష్టించింది. అత్యధికంగా రీట్వీట్ అయిన ట్వీట్టర్‌గా మారింది.