కోవిడ్ బిల్లుపై ట్రంప్ సంతకం చేయకపోతే దారుణ పరిణామాలు, జోబైడెన్ ఆందోళన, అధ్యక్షుడు ఏం చేస్తారోనన్నఉత్కంఠ.

| Edited By: Pardhasaradhi Peri

Dec 27, 2020 | 12:00 PM

కోవిడ్ 19 బిల్లుపై సంతకం చేయడానికి అధ్యక్షుడు ట్రంప్ నిరాకరించడంపై స్పందించిన జో బైడెన్.. ఆయన ఇలాగే జాప్యం చేస్తే దేశానికి దారుణ పరిణామాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు...

కోవిడ్ బిల్లుపై ట్రంప్ సంతకం చేయకపోతే దారుణ పరిణామాలు, జోబైడెన్ ఆందోళన, అధ్యక్షుడు ఏం చేస్తారోనన్నఉత్కంఠ.
Follow us on

కోవిడ్ 19 బిల్లుపై సంతకం చేయడానికి అధ్యక్షుడు ట్రంప్ నిరాకరించడంపై స్పందించిన జో బైడెన్.. ఆయన ఇలాగే జాప్యం చేస్తే దేశానికి దారుణ పరిణామాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది అమెరికన్ల ప్రయోజనానికి ఉద్దేశించిన బిల్లును కాంగ్రెస్ ఆమోదించినప్పటికీ ట్రంప్ మాత్రం ఇందులో సవరణలు చేయాలని పట్టుబడుతున్నారు. ఆయన బిల్లుపై సంతకం పెట్టకపోతే సుమారు కోటిమందికి పైగా అమెరికన్లకు ఉపాధిరహిత ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పొందలేకపోతారని బైడెన్ అన్నారు. కొన్ని రోజుల్లోనే ప్రభుత్వ నిధుల కాలపరిమితి ముగిసిపోతుందని, మిలిటరీ సిబ్బందితో  సహా వివిధ సర్వీసులకు సంబంధించి వ్యయాన్ని నిర్దేశించలేకపోతారని, వారం రోజుల్లోగా ఎవిక్షన్స్ పై మారటోరియం కూడా ముగిస్తే లక్షలాదిమంది తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ డార్క్ వింటర్ లో చిన్నపాటి బిజినెస్ లన్నీ మూతబడతాయని  ఆయన వ్యాఖ్యానించారు.  ట్రంప్ మనసు మార్చుకుని బిల్లుపై సంతకం చేయగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

900 మిలియన్ డాలర్ల బిల్లును కాంగ్రెస్ ఆమోదించినా..ఇది చాలా అసంపూర్తిగా, అసమగ్రంగా ఉందని ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Read More:

ఈ ఏడాదిలో చివరి మన్​కీ బాత్ నేడే, మోదీ ప్రసంగ సమయంలో పళ్లాలపై చప్పుడుచేసే నిరసనకు రైతు సంఘాల పిలుపు

BJP: బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడతాం… మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ…

India Vs Australia 2020: ఆధిక్యంలో టీమిండియా.. సెంచరీకి చేరువలో రహానే.. రాణిస్తున్న జడేజా..