జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌పై అధికారుల దాడులు…

|

Jul 08, 2020 | 5:43 PM

Inspections on the Jubileehills Public School : నిబంధనలు ఉల్లంగించిన పాఠశాలపై తెలంగాణ విద్యాశాఖ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.  హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్ స్కూల్‌(JPS) పై విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్, హైదరాబాద్ డీఈఓ తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంగిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు స్కూల్‌లో […]

జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌పై అధికారుల దాడులు...
Follow us on

Inspections on the Jubileehills Public School : నిబంధనలు ఉల్లంగించిన పాఠశాలపై తెలంగాణ విద్యాశాఖ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.  హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్ స్కూల్‌(JPS) పై విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్, హైదరాబాద్ డీఈఓ తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంగిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన అధికారులు స్కూల్‌లో తనిఖీలు చేపట్టారు. ఫీజూ వసూళ్లకు సంబంధించి అన్ని పత్రాలను పరిశీలించారు. అనంతరం కొన్ని పత్రాలను తీసుకొని వెళ్లిన అధికారులు.. మరి కొన్ని డాక్యుమెంట్స్ వెంటనే సమర్పించాలని యాజమాన్యానికి ఆదేశించారు. ఫైల్స్ మెయింటైన్స్ సరిగా లేదని..,పారదర్శకంగా లేవని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది.