కరోనాతో పరిస్థితులు తారుమారు.. వ్యవసాయానికి ఫుల్ డిమాండ్‌..

| Edited By:

Jul 11, 2020 | 6:54 AM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. కాగా.. పంట భూములను కౌలుకు అప్పగించి పట్టణాలకు పయనమైన వారంతా గ్రామాలకు తిరిగొచ్చారు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల

కరోనాతో పరిస్థితులు తారుమారు.. వ్యవసాయానికి ఫుల్ డిమాండ్‌..
Rythu bandhu money
Follow us on

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. కాగా.. పంట భూములను కౌలుకు అప్పగించి పట్టణాలకు పయనమైన వారంతా గ్రామాలకు తిరిగొచ్చారు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి దొరక్క అంతా పల్లెబాట పట్టారు. ఇప్పుడు వారి దృష్టి సేద్యం వైపు మళ్లడంతో కౌలు భూములకు డిమాండ్‌ పెరిగింది. గతానికి భిన్నంగా ఈ ఏడాది కౌలు ధరలు ఇంతగా పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికిస్తున్న ప్రోత్సాహం ఒక కారణమైతే.. కరోనా దెబ్బకు అన్ని రంగాలూ దెబ్బతిన్నప్పటికీ వ్యవసాయ పనులు మాత్రం యథావిధిగా సాగుతుండటం మరో కారణం.

కరోనా మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. చిన్నాచితకా వ్యాపారాలు కుంటుపడ్డాయి. ప్రైవేటు కంపెనీలు, ఇతర రంగాలలో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడంతో నిరుద్యోగ యువత వ్యవసాయం వైపు చూస్తోంది. గడచిన నాలుగు నెలలుగా మార్కెట్‌ పూర్తిగా దెబ్బతింది. వ్యాపారాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు లేకపోవడంతో సొంత భూములున్న రైతులు కౌలుకు ఇవ్వడం మానేసి తామే సాగుకు సన్నద్ధమవుతున్నారు. గత ఏడాది వరకు నీటి లభ్యత ఉండి వ్యవసాయ బోర్లు ఉన్న భూములకు జిల్లాలో కౌలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ పోటీ భూ యజమానులకు కలిసి వస్తోంది.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్: రీలింగ్ చేస్తున్న పలువురు సెలెబ్రిటీలు