సునంద పుష్కర్ మృతి కేసులో కొత్త కోణం.. శశి థరూర్‌కు ముప్పు తప్పదా.?

|

Sep 01, 2019 | 2:58 PM

సునంద పుష్కర్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్‌పై హత్య కేసు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని ఢిల్లీ పోలీసులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాత్సవ్ కోరారు. ఈ మేరకు ఆయన 498-A, 306, IPC 302 సెక్షన్ల ప్రకారం ఆయనపై కేసులు పెట్టాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో తన వాదన వినిపించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారం సునంద తన వైవాహిక జీవితంలో భర్త నుంచి ఎంతో టార్చర్‌ను ఎదుర్కొందని.. […]

సునంద పుష్కర్ మృతి కేసులో కొత్త కోణం.. శశి థరూర్‌కు ముప్పు తప్పదా.?
Follow us on

సునంద పుష్కర్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్‌పై హత్య కేసు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని ఢిల్లీ పోలీసులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాత్సవ్ కోరారు. ఈ మేరకు ఆయన 498-A, 306, IPC 302 సెక్షన్ల ప్రకారం ఆయనపై కేసులు పెట్టాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో తన వాదన వినిపించారు.

ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారం సునంద తన వైవాహిక జీవితంలో భర్త నుంచి ఎంతో టార్చర్‌ను ఎదుర్కొందని.. ఆయన ద్రోహచర్యల వల్ల మానసిక క్షోభను అనుభవిస్తూ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. డిప్రెషన్‌కు లోనయ్యి.. చాలారోజులు పస్తులు ఉంది.. శారీరికంగా గాయపరుచుకుందని.. ఇవే ఆమె చావుకి కారణాలని అతుల్ తెలిపారు.

ఆయన మరిన్ని విషయాలను జోడిస్తూ ఆమె మరణం విష ప్రయోగం వల్ల సంభవించిందని.. శరీరంపై ఉన్న గాయాలు కూడా తీవ్రమైన  గొడవల సమయంలో తగిలినట్లు చెప్పారు. ఎందుకంటే ఈ భార్యాభర్తలిద్దరికీ ఇది మూడో పెళ్లి కావడంతో మెంటల్ టార్చర్ అనుభవించి.. దాని వల్ల ఆత్మహత్యకు పాల్పడిందని అతుల్ వెల్లడించారు.

మరోవైపు సునంద పుష్కర్ జర్నలిస్ట్ స్నేహితురాలు స్టేట్మెంట్‌ను కోర్టు ముందు ఉంచుతూ.. పాకిస్థానీ జర్నలిస్ట్ మెహర్ తరార్‌తో శశి థరూర్ ఆ రాత్రి దుబాయ్‌లో గడిపారని.. దీన్ని భరించలేక అదే రాత్రి సునంద ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన తెలిపారు.

ఇక అతుల్ వాదనలను శశి థరూర్ న్యాయవాది వికాస్ పహ్వ ఖండిస్తూ.. ఈ ఆరోపణలు అర్థరహితమని, దురుద్దేశంతో కూడుకున్నవని అన్నారు. ప్రాసిక్యూటర్ సమర్పించిన అధరాలు చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయని నిజానికి సైకోలాజికల్ అటాప్సీ నిర్వహించిన నిపుణుల అభిప్రాయాలను అతుల్ చదవలేదని అన్నారు.