నల్గొండ రైతుల కోసం అక్కడ 24 గంటలూ మార్కెట్.. వాహ్ కిషన్‌ జీ

|

Apr 16, 2020 | 7:44 PM

నల్గొండ రైతుల కోసం ఢిల్లీలో ఓ పెద్ద మార్కెట్ ఇకపై 24 గంటల పాటు తెరిచే వుంచనున్నారు. అదేంటి నల్గొండకు ఢిల్లీ మార్కెట్‌కు లింకేంటనుకుంటున్నారా? వుంది మరి. అందుకే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపింది.

నల్గొండ రైతుల కోసం అక్కడ 24 గంటలూ మార్కెట్.. వాహ్ కిషన్‌ జీ
Follow us on

నల్గొండ రైతుల కోసం ఢిల్లీలో ఓ పెద్ద మార్కెట్ ఇకపై 24 గంటల పాటు తెరిచే వుంచనున్నారు. అదేంటి నల్గొండకు ఢిల్లీ మార్కెట్‌కు లింకేంటనుకుంటున్నారా? వుంది మరి. అందుకే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపింది. ఇన్నాళ్ళు పరిమిత సమయం మాత్రమే ఓపెన్‌గా వుంటున్న మార్కెట్‌ను ఇకపై 24 గంటలపాటు తెరిచి వుంచి వ్యాపార లావాదేవీలు నిర్వహించేలా చేసింది.

దేశ రాజధాని ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీ ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌గా పేరుపొందింది. తెలంగాణలోని నల్గొండ నుంచే ఈ మార్కెట్‌కు ప్రతీ సంవత్సరం 30 వేల మెట్రిక్ టన్నుల బత్తాయి సరఫరా అవుతూ వుంటుంది. అయితే, ఈసారి బత్తాయి పంట చేతికొచ్చే సమయానికి ఆజాద్‌పూర్ మార్కెట్‌పై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దాంతో పరిమిత సమయం మాత్రమే ఈ మార్కెట్‌లో లావాదేవీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి వ్యవసాయ సంబంధ మార్కెట్లకు లావాదేవీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో నల్గొండ రైతాంగం కాస్త ముందుగానే మార్కెట్‌ని తెరవాలని కోరారు.

దాంతో తెలంగాణ బత్తాయి రైతుల తరపున రంగంలోకి దిగారు కిషన్ రెడ్డి. రైతుల డిమాండ్‌ను నెరవేర్చే దిశగా చర్చలు జరిపారు. 24 గంటలు మార్కెట్ తెరిచి ఉంచి, రద్దీ లేకుండా అమ్మకాలు సాగేలా ఏర్పాట్లు చేసేందుకు పురమాయించారు. దాంతో రాత్రి పూట కూడా అమ్మకాలకు వీలు కల్పించేలా ఫ్లడ్ లైట్లను అమర్చారు. దాంతో 24 గంటల పాలు లావాదేవీలు నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. నల్గొండ బత్తాయి రైతులు తమ పంటను సరఫరా చేసేందుకు మార్గం సుగమం అయ్యింది.

ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీని 24 గంటలూ తెరిచేలా ఆదేశాలిచ్చామని, నల్గొండ జిల్లా బత్తాయి రైతుల సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకున్నానని, ఇకపై ఫ్లడ్ లైట్ల వెలుగులో రాత్రి పూట కూడా మార్కెట్‌లో లావాదేవీలు కొనసాగుతాయని కిషన్ రెడ్డి తెలిపారు.

Read: రంజాన్ వార్నింగ్.. నమాజ్‌లో సామాజిక దూరం కంపల్సరీ