ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం

|

Sep 24, 2020 | 10:01 PM

కరోనా సోకి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే.

ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం
Follow us on

రోనా సోకి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇంట్లో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న ఆయనకు బుధవారం సాయంత్రం శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందిగా ఉండ‌టంతో హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా  ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే లోక్‌నాయక్ జయప్రకాష్‌ నారాయణ్ ఆస్పత్రి నుంచి మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. కోవిడ్ తో పాటు ఆయన డెంగ్యూతో కూడా బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్లేట్‌లెట్లు కౌంట్ పడిపోవడం, ఆక్సీజన్ శాతం పడిపోవడంతో ప్రస్తుతం మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు.  ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మనీశ్ సిసోడియాకు పది రోజుల కిందట జ్వరం రావడంతో కరోనా టెస్టులు చేయించుకున్నారు. సెప్టెంబర్ 14న పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది.

గతవారం తనకు కరోనా సోకిినట్లు వెల్లడించిన మనీశ్ సిసోడియా ‘మీ అందరి దీవెనలతో త్వరలోనే విధుల్లో చేరుతా..’ అంటూ ఢిల్లీ ప్రజ‌ల‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

Also Read :

మామకు అనారోగ్యం, పరామర్శించిన సీఎం జగన్

శ్రీశైలంలోని ఘంటా మఠంలో మరో అద్భుతం