మేడారం జాతరకు.. త్వరలో జాతీయ హోదా!

| Edited By:

Feb 10, 2020 | 5:26 AM

తెలంగాణ కుంభమేళా మేడారం గిరిజన జాతరను ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా అభివర్ణించారు కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి అర్జున్‌ముండా. దీనిని జాతీయ పండుగగా గుర్తించే అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. శనివారం ఆయన మేడారంలో జరుగుతున్న మహాజాతరకు విచ్చేసి సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని ఆయనకు విన్నవించారు. మంత్రి అర్జున్‌ ముండా శనివారం మేడారం జాతరకు వచ్చి గద్దెలపై […]

మేడారం జాతరకు.. త్వరలో జాతీయ హోదా!
Follow us on

తెలంగాణ కుంభమేళా మేడారం గిరిజన జాతరను ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా అభివర్ణించారు కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి అర్జున్‌ముండా. దీనిని జాతీయ పండుగగా గుర్తించే అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. శనివారం ఆయన మేడారంలో జరుగుతున్న మహాజాతరకు విచ్చేసి సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని ఆయనకు విన్నవించారు.

మంత్రి అర్జున్‌ ముండా శనివారం మేడారం జాతరకు వచ్చి గద్దెలపై ఉన్న వన దేవతలను దర్శించుకుని, నిలువెత్తు బంగారం సమర్పించారు. మేడారం జాతరకు త్వరలోనే జాతీయహోదా లభించొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద గిరిజన జాతర ఎక్కడాలేదని, ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని ఇప్పటికే సీఎం సహా మంత్రులు, ఎంపీలు కేంద్రాన్ని కోరారన్నారు. తాను ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవడం తనకు ఆనందంగా ఉందని అర్జున్‌ముండా తెలిపారు. గిరిజనుల కల సాకారం అవుతుందని, మళ్లొచ్చే జాతరకు తాను మేడారం వస్తానన్నారు.