ఏప్రిల్ 14 త‌ర్వాత‌ విద్యాసంస్థ‌ల రీ ఓపెనింగ్ పై కేంద్ర మంత్రి క్లారిటీ..

|

Apr 05, 2020 | 6:25 PM

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వ‌రకు లాక్ డౌన్ కొన‌సాగనుంది. ఈ నేపథ్యంలో ఈ లాక్ డౌన్ 14న‌ ముగిసిపోతుందా..లేక ఇంకా కొన‌సాగిస్తారా అనే అంశంపై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఈ క్రమంలో విద్యాసంస్థ‌లు మ‌ళ్లీ రీ ఓపెన్ చేస్తారా..లేక సెల‌వ‌లు కొన‌సాగిస్తారా అనే విష‌యంపై కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ క్లారిటీ ఇచ్చారు. స్కూళ్లు మళ్లీ ఎప్పుడు తెరుస్తారనే అంశంపై ఏప్రిల్ 14న లాక్ డౌన్ ముగిసిన తర్వాత వైరస్ తీవ్ర‌త, ఇత‌ర అంశాల‌పై సమీక్ష […]

ఏప్రిల్ 14 త‌ర్వాత‌  విద్యాసంస్థ‌ల రీ ఓపెనింగ్ పై కేంద్ర మంత్రి క్లారిటీ..
Follow us on

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వ‌రకు లాక్ డౌన్ కొన‌సాగనుంది. ఈ నేపథ్యంలో ఈ లాక్ డౌన్ 14న‌ ముగిసిపోతుందా..లేక ఇంకా కొన‌సాగిస్తారా అనే అంశంపై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఈ క్రమంలో విద్యాసంస్థ‌లు మ‌ళ్లీ రీ ఓపెన్ చేస్తారా..లేక సెల‌వ‌లు కొన‌సాగిస్తారా అనే విష‌యంపై కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ క్లారిటీ ఇచ్చారు. స్కూళ్లు మళ్లీ ఎప్పుడు తెరుస్తారనే అంశంపై ఏప్రిల్ 14న లాక్ డౌన్ ముగిసిన తర్వాత వైరస్ తీవ్ర‌త, ఇత‌ర అంశాల‌పై సమీక్ష జరుగుతుందని, ఆ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు పునఃప్రారంభం చేయడం కంటే.. స్టూడెంట్స్, టీచ‌ర్ల ఆరోగ్యం ముఖ్య‌మ‌ని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అప్పుడున్న ప‌రిస్థితుల వ‌ల్ల‌ ఏప్రిల్ 14 తర్వాత విద్యాసంస్థలు ఓపెన్ చెయ్య‌డం కుద‌ర‌క‌పోయినా.. వారు నష్టపోకుండా చ‌ర్య‌లుంటాయ‌ని పేర్కొన్నారు. కాగా ఇటీవ‌లే 1వ‌ తరగతి నుంచి 8వ తరగతి వరకు సీబీఎస్ఈ విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయం తీసుకుంది. 9, 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు అటెండెన్స్, స్కూల్స్ లో నిర్వ‌హించిన పరీక్ష‌లు లాంటి వివిధ అంశాల ఆధారంగా పై త‌రగ‌తుల‌కు ప్ర‌మోట్ చేస్తామ‌ని కేంద్ర మానవ వనరుల శాఖ తెలిపింది.