విషాద గాథ..బిడ్డల ఆకలి తీర్చడానికి జుట్టు అమ్ముకున్న తల్లి

| Edited By:

Jan 14, 2020 | 10:46 AM

అమ్మ..ఆమె గురించి ఏమని చెప్పగలం. ఎంతని చెప్పగలం. అమితమైన ప్రేమ అమ్మ సొంతం. బ్రతుకునంతా బిడ్డలకే దారబోసి వారి సంతోషంలోనే తమ ఆనందాన్ని వెతుక్కుంటారు పిచ్చి మహారాణులు. పిల్లలకు చిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతారు. ప్రాణం పోసిన మాతృమూర్తులు, అవసరమైతే తమ బిడ్డల కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమైపోతారు. ఇప్పుడు ఓ పేద తల్లి పడ్డ కష్టాలను మీకు వివరించబోతున్నాం. అమ్మతనం ఎంత గొప్పదో చూపించబోతున్నాం. తమిళనాడుకు చెందిన ప్రేమ(30) అనే మహిళ భర్త ఇటీవలే సూసైడ్ […]

విషాద గాథ..బిడ్డల ఆకలి తీర్చడానికి జుట్టు అమ్ముకున్న తల్లి
Follow us on

అమ్మ..ఆమె గురించి ఏమని చెప్పగలం. ఎంతని చెప్పగలం. అమితమైన ప్రేమ అమ్మ సొంతం. బ్రతుకునంతా బిడ్డలకే దారబోసి వారి సంతోషంలోనే తమ ఆనందాన్ని వెతుక్కుంటారు పిచ్చి మహారాణులు. పిల్లలకు చిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతారు. ప్రాణం పోసిన మాతృమూర్తులు, అవసరమైతే తమ బిడ్డల కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమైపోతారు. ఇప్పుడు ఓ పేద తల్లి పడ్డ కష్టాలను మీకు వివరించబోతున్నాం. అమ్మతనం ఎంత గొప్పదో చూపించబోతున్నాం.

తమిళనాడుకు చెందిన ప్రేమ(30) అనే మహిళ భర్త ఇటీవలే సూసైడ్ చేసుకున్నాడు. ముగ్గురు చిన్న వయసు పిల్లలు ఉండటంతో వారిని పోషించే భారమంతా ఆమెపైనే పడింది. బంధువులు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ప్రత్యేకంగా చెప్పాలా..?. సహాయం చెయ్యకపోగా సూటిపోటి మాటలతో ప్రేమను కూడా దెప్పిపొడిచారు. ఇంట్లో ఉన్న ఒక్కో వస్తువును అమ్ముకుంటూ ఇన్నాళ్లు బిడ్డ ఆకలిని తీర్చగల్గింది ఆమె. చివరకు పిల్లలతో సహా రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. దిక్కుతోచని పరిస్థితుల్లో కనిపించిన ఓ వ్యక్తిని సాయం అడిగింది. అయితే సవరం కోసం జుట్టు కావాలని, గుండు చేయించుకుని ఇస్తే..రూ. 150 ఇస్తానని అతడు చెప్పాడు. మరుక్షణం ఆలోచించకుండా ఆమె గుండు కొట్టుంచుకుని వచ్చిన డబ్బుతో పిల్లల కడుపు నింపింది. కానీ ఆకలి మహా చెడ్డది. పేదోళ్లపై ముప్పేట దాడి చేస్తోంది. పిల్లలకు అన్నం కూడా పెట్టలేని తన బ్రతుకు వ్యర్థమని చనిపోవాలని నిర్ణయించుకుంది. సూసైడ్ ప్రయత్నాలు కూడా చేసింది. కానీ విధి ఆవిడ్ని చనిపోనివ్వలేదు.

జి బాలా అనే గ్రాఫిక్ డిజైనర్‌కు ఆమె బ్రతుకు కష్టాలు తారసపడ్డాయి. వెంటనే అతను ఫేస్‌బుక్‌లో ఆమె జీవిత వ్యధను పోస్ట్ చేసి.. సాయం చేయమని అభ్యర్థించాడు.  కొందరు స్పందించి ఆర్థిక సాయం చేశారు. లక్షా నలభై ఐదు వేల నగదు సమకూరింది. మరో వ్యక్తి ఇటుకల బట్టిలో పని కల్పించాడు. డబ్బు కొందరికి అవసరం కావొచ్చు. మరికొందరికి జీవితం. సదరు ఫేస్‌బుక్ ఫోస్ట్ అధికారుల్లో కూడా చలనం తీసుకొచ్చింది. రూ.25 వేల ఆర్థికసాయంతో పాటు రేషన్ కార్డు కూడా అందించారు. ఇక ప్రతి నెలా వితంతు పెన్షన్ ఇస్తామని తెలిపారు. ఇప్పుడు ఆమె బిడ్డల్ని చదివించుకుంటోంది. రేపటి బిడ్డల జీవితంపై గొప్ప ఆశలతో బ్రతకుతోంది. దేవుడికే కాదు మనుషులకు కూడా వరం ఇచ్చే అవకాశం ఉంది. దాని పేరు సహాయం.