ప్రకాశం జిల్లాలో విషాదం: శానిటైజర్ తాగి ఎనిమిదిమంది మృతి !

|

Jul 31, 2020 | 9:10 AM

ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శానిటైజర్ తాగి ఏకంగా ఎనిమిది చ‌నిపోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర జీవ‌నం సాగించే యాచకులు మద్యానికి బానిసలయ్యారు.

ప్రకాశం జిల్లాలో విషాదం: శానిటైజర్ తాగి ఎనిమిదిమంది మృతి !
Follow us on

Sanitizer deaths : ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శానిటైజర్ తాగి ఏకంగా ఎనిమిది చ‌నిపోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర జీవ‌నం సాగించే యాచకులు మద్యానికి బానిసలయ్యారు. కాగా మ‌ద్యం ధ‌ర‌లు విప‌రీతంగా పెర‌గ‌డంతో..గ‌త కొద్ది రోజులుగా వారు శానిటైజర్లు సేవిస్తున్న‌ట్లు స‌మాచారం. గురువారం రాత్రి కడుపులో మంటతో ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మరో వ్యక్తి కూడా తీవ్ర అనారోగ్యానికి గురి కావ‌డంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. వెంటనే అతడ్ని దర్శి గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా..చికిత్స పొందుతూ చ‌నిపోయాడు.

ఇటు కురిచేడులోని పీఎస్ ద‌గ్గ‌ర్లో ఉండే రమణయ్య గురువారం ఉదయం శానిటైజర్‌, నాటు సారా కలిపి సేవిస్తుండ‌గా స్థానికులు గ‌మ‌నించి..వారించారు. కానీ అప్పటికే తాగేశాడు. ఇంటికి వెళ్లాక‌ అపస్మారక స్థితిలో వెళ్ల‌గా.. కుటుంబసభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. అతడ్ని దర్శి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్దారించారు. ఇదిలా ఉంటే శుక్రవారం కూడా మరో ఐదుగురు ఇలానే చనిపోయినట్లు స‌మాచారం. ఒకే యాచకుల బృందానికి చెందిన వీరంతా వేరు వేరు ప్రాంతాల్లో తిరుగుతూ మృతి చెందినట్టు గుర్తించారు పోలీసులు. వీరంతా శానిటైజర్ తాగారా.. నాటుసారా తాగి చ‌నిపోయారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Read More : కరోనా స‌మయంలో బక్రీద్ : ‌‌డ‌బ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలు