అసోంను వణికిస్తున్న మెదడువాపు వ్యాధి.. ఒక్కరోజులోనే 12 మంది మృతి

| Edited By:

Jul 01, 2019 | 8:48 AM

గత కొద్ది రోజులుగా బీహార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మెదడువాపు వ్యాధి తాజాగా అసోంను కూడా వణికిస్తోంది. అసోంలో ఈ వ్యాధితో మరణించిన చిన్నారుల సంఖ్య 12కు చేరుకుంది. మెదడువాపు వల్ల బార్పేట జిల్లాలో 15 ఏండ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికి 35 పాజిటివ్ కేసులను వైద్యులు గుర్తించారు. గౌహతి మెడికల్ కాలేజీ దవాఖాన, జోర్హట్ మెడికల్ కాలేజీ దవాఖానలో పలువురు చికిత్స పొందుతున్నారు. అలాగే అసోంలోని పలు జిల్లాల్లోనూ మెదడువాపు కేసులు నమోదయ్యాయి. మరోవైపు చిన్న […]

అసోంను వణికిస్తున్న మెదడువాపు వ్యాధి.. ఒక్కరోజులోనే 12 మంది మృతి
Follow us on

గత కొద్ది రోజులుగా బీహార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మెదడువాపు వ్యాధి తాజాగా అసోంను కూడా వణికిస్తోంది. అసోంలో ఈ వ్యాధితో మరణించిన చిన్నారుల సంఖ్య 12కు చేరుకుంది. మెదడువాపు వల్ల బార్పేట జిల్లాలో 15 ఏండ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికి 35 పాజిటివ్ కేసులను వైద్యులు గుర్తించారు. గౌహతి మెడికల్ కాలేజీ దవాఖాన, జోర్హట్ మెడికల్ కాలేజీ దవాఖానలో పలువురు చికిత్స పొందుతున్నారు. అలాగే అసోంలోని పలు జిల్లాల్లోనూ మెదడువాపు కేసులు నమోదయ్యాయి. మరోవైపు చిన్న పిల్లల మరణాలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని అసోంకు పంపింది. ఈ వ్యాధిని నివారించడానికి కృషి చేయడంతోపాటు చికిత్స పొందుతున్న చిన్నారులకు వైద్యం అందించడానికి రాష్ట్ర వైద్యులకు సహకరించాలని బృందాన్ని కేంద్రం ఆదేశించింది. అసోంలో పరిస్థితిని నిత్యం సమీక్షిస్తున్నామని, పిల్లల మరణాలు మరింత పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య శాక మంత్రి హర్షవర్దన్ చెప్పారు.