చోరీకి గురైన బస్సు.. చివరకు మిగిలింది ఇదే…

| Edited By:

Apr 26, 2019 | 12:02 PM

మూడు రోజుల క్రితం గౌలిగూడ బస్టాండ్‌లో చోరీకి గురైన ఆర్టీసీ బస్సు “శిథిలాలు” లభ్యమయ్యాయి. కుషాయిగూడ డిపోకు చెందిన మెట్రో ఎక్స్‌ప్రెస్‌ (ఏపీ 11 జెడ్‌ 6254)బస్సును అఫ్జల్‌గంజ్‌ పోలీసులు మహారాష్ట్రలోని నాందేడ్‌లో స్వాధీనం చేసుకున్నారు. బస్సు అదృశ్యంపై నగర పోలీసులు, ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సీసీ పుటేజీలను పరిశీలించారు. వాటి ఆధారంగా గౌలిగూడ నుంచి తూప్రాన్‌ వైపు బస్సు వెళ్లినట్లు గుర్తించారు. నేషనల్‌ హైవేస్‌ […]

చోరీకి గురైన బస్సు.. చివరకు మిగిలింది ఇదే...
Follow us on

మూడు రోజుల క్రితం గౌలిగూడ బస్టాండ్‌లో చోరీకి గురైన ఆర్టీసీ బస్సు “శిథిలాలు” లభ్యమయ్యాయి. కుషాయిగూడ డిపోకు చెందిన మెట్రో ఎక్స్‌ప్రెస్‌ (ఏపీ 11 జెడ్‌ 6254)బస్సును అఫ్జల్‌గంజ్‌ పోలీసులు మహారాష్ట్రలోని నాందేడ్‌లో స్వాధీనం చేసుకున్నారు. బస్సు అదృశ్యంపై నగర పోలీసులు, ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సీసీ పుటేజీలను పరిశీలించారు. వాటి ఆధారంగా గౌలిగూడ నుంచి తూప్రాన్‌ వైపు బస్సు వెళ్లినట్లు గుర్తించారు. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ సహాయంతో తూప్రాన్‌ టోల్‌గేట్‌ వద్ద నమోదైన సీసీ కెమెరా దృశ్యాలను కూడా పరిశీలించగా..బస్సు అదే మార్గంలో వెళ్లినట్లు కనిపించింది. తూప్రాన్‌ దాటి నిర్మల్, భైంసాల మీదుగా నాందేడ్‌కు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో సుల్తాన్‌ బజార్‌ పోలీసుల బృందం నాందేడ్‌కు చేరుకుంది. బస్సు ఏ భాగానికి ఆ భాగం విడిపోయిన “దృశ్యాన్ని” ఓ మెకానిక్ షెడ్ లో చూసి వారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. కేవలం ఛాసిస్ మాత్రమే కనబడింది వారికి. పోలీసుల రాకను గమనించిన దొంగల్లో కొందరు పరారీ కాగా.. ఒకర్ని ఖాకీలు అరెస్ట్ చేశారు.