హాఫ్ హెల్మెట్లు పెట్టుకుంటున్నారా..? అంతే సంగతి..

హైదరాబాద్‌లో రెగ్యులర్‌గా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి..వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనలకు కళ్లెం వేస్తున్నా కూడా.. వరసగా యాక్సిడెంట్స్ జరగడాన్ని పోలీస్ డిపార్ట్ మెంట్ సీరియస్‌గా తీసుకుంది. ఓవర్ స్పీడ్, నాసిరకం(హాఫ్) హెల్మెట్లు వాడటం..ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా గుర్తించింది. దీంతో వెంటనే చర్యలకు ఉపక్రమించింది. నగర వ్యాప్తంగా ఐఎస్‌ఐ మార్క్‌తో కూడిన హెల్మెట్లు మాత్రమే విక్రయాలు జరపాలని..వ్యాపారులకు పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై  సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే స్పెషల్ […]

హాఫ్ హెల్మెట్లు పెట్టుకుంటున్నారా..? అంతే సంగతి..

Updated on: Nov 25, 2019 | 2:09 PM

హైదరాబాద్‌లో రెగ్యులర్‌గా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి..వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనలకు కళ్లెం వేస్తున్నా కూడా.. వరసగా యాక్సిడెంట్స్ జరగడాన్ని పోలీస్ డిపార్ట్ మెంట్ సీరియస్‌గా తీసుకుంది. ఓవర్ స్పీడ్, నాసిరకం(హాఫ్) హెల్మెట్లు వాడటం..ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా గుర్తించింది. దీంతో వెంటనే చర్యలకు ఉపక్రమించింది.

నగర వ్యాప్తంగా ఐఎస్‌ఐ మార్క్‌తో కూడిన హెల్మెట్లు మాత్రమే విక్రయాలు జరపాలని..వ్యాపారులకు పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై  సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. నకిలీ హెల్మెట్ అమ్మకాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. భారీగా నకిలీ హెల్మెట్లు స్వాదీనం చేసుకోని వాటిని ధ్వంసం చేస్తున్నారు. నగరంలో చాలామంది కేవలం ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోడానికే..నకిలీ హెల్మెట్లు వాడుతున్నారని..ఇది మంచి పరిణామం కాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వార్నింగ్ ఇవ్వడంతో..ఈ సారి నుంచి నకిలీ హెల్మట్లు ధరించే వాహనదారులపై భారీ స్థాయిలో ఫైన్స్ వేసేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్దమవుతున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us