రోడ్డు ప్రమాదం జరిగితే పెద్ద వాహనంపైనే కేసు..ఇదంతా నిన్నటి విధానం.. ఇకముందు ఇది కుదరదంటున్న సీపీ సజ్జనార్

|

Dec 29, 2020 | 2:44 PM

రోడ్డు ప్రమాదం జరిగితే.. పెద్ద వాహనంపైనే కేసు నమోదు. ఇదంతా నిన్నటి విధానం. ఇప్పుడు తప్పెవరిదో.. వారిపైనే కేసు నమోదు చేస్తున్నామని సైబరాబాద్ సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. పెద్ద వాహనం.. చిన్న వాహనం అని చూడకుండా..

రోడ్డు ప్రమాదం జరిగితే పెద్ద వాహనంపైనే కేసు..ఇదంతా నిన్నటి విధానం.. ఇకముందు ఇది కుదరదంటున్న సీపీ సజ్జనార్
Follow us on

Hyderabad Road Accidents : రోడ్డు ప్రమాదం జరిగితే.. పెద్ద వాహనంపైనే కేసు నమోదు. ఇదంతా నిన్నటి విధానం. ఇప్పుడు తప్పెవరిదో.. వారిపైనే కేసు నమోదు చేస్తున్నామని సైబరాబాద్ సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. పెద్ద వాహనం.. చిన్న వాహనం అని చూడకుండా.. తప్పు చేసిన వారిపైనే కేసులు నమోదు చేస్తుని సజ్జనార్ తేల్చి చెప్పారు.

సైబరాబాద్ కమిషనర్‌ పరిధిలో కేసులకు సంబంధించి యానివల్ రిపోర్ట్‌ను సజ్జనార్ విడుదల చేశారు. 2020 పీస్‌ఫీల్ ఇయర్‌గా మిగులుతోందని అన్నారు. అయితే ఈ ఏడాదిలో సైబర్ క్రైమ్ 135 శాతం పెరిగిందని అన్నారు. రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌ కోసం పోలీసులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లుగా సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు.