నకిలీ వెబ్‌సైట్లతో… భక్తులకు టోపీ!

| Edited By:

Dec 11, 2019 | 5:45 AM

దైవ దర్శనం కోసం ప్రముఖ దేవాలయాలకు వెళుతున్నారా? ఫ్యామిలీతో స్వామి అమ్మవార్ల సేవలో తరించాలని అనుకుంటున్నారా? ముందుగానే ఆన్ లైన్లో సేవలను, గదులను బుక్ చేసుకున్నారా? అయితే మీ డబ్బులు గల్లంతైనట్లే. బెజవాడ దుర్గ గుడితో పాటు ప్రముఖ దేవాలయాలకు సంబంధించి నకిలీ వెబ్ సైట్లను ఏర్పాటు చేసి భక్తులను నిండా ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఇ-దర్శన్, ఇ-ప్రార్థన, ఇ-పూజ.. ఈ వెబ్ సైట్లు ఎవరివి. ఇన్నాళ్లూ పూజల పేరుతో వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి చేరాయన్నది ఇప్పుడు […]

నకిలీ వెబ్‌సైట్లతో... భక్తులకు టోపీ!
Follow us on

దైవ దర్శనం కోసం ప్రముఖ దేవాలయాలకు వెళుతున్నారా? ఫ్యామిలీతో స్వామి అమ్మవార్ల సేవలో తరించాలని అనుకుంటున్నారా? ముందుగానే ఆన్ లైన్లో సేవలను, గదులను బుక్ చేసుకున్నారా? అయితే మీ డబ్బులు గల్లంతైనట్లే. బెజవాడ దుర్గ గుడితో పాటు ప్రముఖ దేవాలయాలకు సంబంధించి నకిలీ వెబ్ సైట్లను ఏర్పాటు చేసి భక్తులను నిండా ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఇ-దర్శన్, ఇ-ప్రార్థన, ఇ-పూజ.. ఈ వెబ్ సైట్లు ఎవరివి. ఇన్నాళ్లూ పూజల పేరుతో వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి చేరాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మూడు వెబ్ సైట్లు నకిలీవని దుర్గ గుడి అధికారులు తేల్చారు. తమ అనుమతి లేకుండా వెబ్ సైట్లో దేవస్థానం సేవలు ఉంచారని వారు ఆరోపిస్తున్నారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు.