మేడమ్ వైపే పెద్దల మొగ్గు.. కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా సోనియాగాంధీ

|

Aug 10, 2019 | 11:31 PM

ఢిల్లీ: కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ వీడింది. పార్టీ పగ్గాలను సోనియా గాంధీకే అప్పగించాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాను ఎంపిక చేసినట్లు ఆజాద్ ప్రకటించారు. త్వరలో పూర్తి స్థాయి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ప్రియాంకా గాంధీ, గులాం నబీ ఆజాద్‌, ఏకే ఆంటోనీ, చిదంబరం, అంబికా సోనీ లాంటి సీనియర్ నేతలు తమ తమ నివేదికను పార్టీ వర్గాలకు వెల్లడించారు. రాహుల్ చీఫ్‌గా ఉండేందుకు ససేమేరా […]

మేడమ్ వైపే పెద్దల మొగ్గు.. కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా సోనియాగాంధీ
Follow us on

ఢిల్లీ: కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ వీడింది. పార్టీ పగ్గాలను సోనియా గాంధీకే అప్పగించాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాను ఎంపిక చేసినట్లు ఆజాద్ ప్రకటించారు. త్వరలో పూర్తి స్థాయి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ప్రియాంకా గాంధీ, గులాం నబీ ఆజాద్‌, ఏకే ఆంటోనీ, చిదంబరం, అంబికా సోనీ లాంటి సీనియర్ నేతలు తమ తమ నివేదికను పార్టీ వర్గాలకు వెల్లడించారు. రాహుల్ చీఫ్‌గా ఉండేందుకు ససేమేరా అన్నారు. ప్రియాంక కూడా పార్టీని ముందుండి నడిపించేందుకు విముఖత చూపారు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయటివాళ్లని చీఫ్‌గా నియమిస్తే పార్టీలో చీలికలు వస్తాయని పలువురు నేతలు అభిప్రాయపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.